పెద్ద సినిమాలకు ఆర్దిక భరోసా ..శాటిలైట్ రైట్స్ రూపంలో దొరుకుతోంది. సినిమా ప్రారంభం కాగానే ఆ ప్రాజెక్టుకు వస్తున్న క్రేజ్ ని బట్టి శాటిలైట్ రైట్స్ రేటుని ఫైనల్ చేసుకుంటున్నారు నిర్మాత. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కు కూడా శాటిలైట్ రైట్స్ ని ఫైనల్ చేసారని వినికిడి. 

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ..జీ నెట్ వర్క్ వారు దాదాపు వంద కోట్లు కు ఈ చిత్రం అన్ని భాషల శాటిలైట్ రైట్స్ ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు. 

రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ కలిసి చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చిత్రమిదే. అంతేకాదు, ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి వివరాలు బయటికి రాలేదు. సోషల్ మీడియాలో ఈ చిత్ర కథ ఇదేనంటూ పలు కథనాలు వెలువడినాయి కానీ.. చిత్రయూనిట్ నుంచి మాత్రం ఎటువంటి సమాచారం అఫీషియల్‌గా రాలేదు.  

అయితే రీసెంట్ గా రామ్ చరణ్ ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉండబోతోందో మీడియాకు చెప్పేశాడు. ఈ సినిమాలో మళ్లీ డీ గ్లామరైజ్‌డ్ పాత్రలో నటించబోతున్నట్లుగా తెలిపాడు. ఇప్పటికే రంగస్థలం చిత్రంలో చరణ్ డీ గ్లామరైజ్‌డ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. 

‘‘నాకోసం రాజమౌళిగారు మళ్లీ డీ గ్లామరైజ్‌డ్ పాత్రను సృష్టించారు. ఆర్ ఆర్ ఆర్ లో నేను చేయబోయే ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచుస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం ఈ సినిమాకే కేటాయించాను. అందుకే మరో సినిమా అంగీకరించలేదు..’’ అని చరణ్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి..

చరణ్ - తారక్.. సిద్ధమా?

చరణ్, ఎన్టీఆర్ లకు విముక్తి ఎప్పుడంటే..?

'RRR':సంక్రాంతికి రాజమౌళి హీరోయిన్లు!

'RRR': పూర్వజన్మలో స్నేహితులు.. మరి ఇప్పుడు..?

'RRR'లో అతిథిరావు హైదరి..?

'RRR'లో రామ్ చరణ్ పెట్టుబడి..?

షాకింగ్: 'RRR'స్క్రిప్ట్ పూర్తి కాలేదా..?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’: హీరోయిన్స్ ఫైనల్!ఆ లక్కీ స్టార్స్ ఎవరంటే...

#RRR ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్.. మీరు సిద్ధమా?: రాజమౌళి

'RRR'లో ఎన్టీఆర్ లుక్.. ఇదొక ఫేక్ స్టోరీ!

రాజమౌళి 'RRR'కి బ్రేక్ ఇచ్చేశారు.. కారణమేమిటంటే..?

RRR ఫోటో లీక్: షాకిస్తున్న ఎన్టీఆర్.. నిజమేనా?

రాజమౌళికి అస్వస్థత.. 'RRR' షూటింగ్ కి బ్రేక్!

RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?

RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?

'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!

#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?

'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్

హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!

RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!

'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!