దర్శకధీరుడు రాజమౌళి రూపొందించనున్న మల్టీస్టారర్ లో హీరోలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ సినిమా ఈరోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సినిమా షూటింగ్ లో హీరోలు జాయిన్ కానున్నారు. భారీ యాక్షన్ ఎపిసోడ్ ని చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా ఉపాసన పెట్టిన ట్వీట్ అభిమానులను ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఉపాసన.. రామ్ చరణ్ కి సంబంధించిన అప్ డేట్స్ ని వెల్లడిస్తూ అభిమానులను ఖుషీ చేస్తుంటుంది.

తాజాగా చరణ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ మాలలో ఉన్న చరణ్ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. 'RRR' షూటింగ్ మొదలవుతుందని ఆనందపడుతోన్న ఫ్యాన్స్ కి తన ట్వీట్ తో మరింత ఉత్సాహాన్నిస్తోంది ఉపాసన.