రాఖి సినిమా వరకు బొద్దుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ తరువాత రాజమౌళి డిమాండ్ కి సడన్ గా బరువు తగ్గాడు. యమదొంగ సినిమా కోసం సన్నబడటానికి తారక్ అప్పట్లో ఎంతో కష్టపడ్డాడు. ఇక ఇప్పుడు మళ్ళీ అదే రాజమౌళి కోసం తారక్ బరువు పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తారక్ చరణ్ తో కలిసి RRRలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు 100 కేజీలు బరువెక్కినట్లు టాక్ వస్తోంది. అరవింద సమేత వరకు సిక్స్ ప్యాక్ బాడీతో కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేసిన నందమూరి హీరో ఇప్పుడు RRR కోసం మరకతప్పలేదట. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు గాని ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబందించిన ఒక లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అది కూడా నిజమని ఇంకా నిర్ధారణ కాలేదు గాని రాజమౌళి సినిమాకోసమే తారక్ ఇలా బొద్దుగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు చరణ్ పాత్ర కూడా డిఫరెంట్ గా ఉండబోతోంది. పోలీస్ పాత్ర అని టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి మెగా హీరో రెగ్యులర్ గానే కనిపిస్తున్నాడు. అయితే వినయ విధేయ రామ కు గుమ్మడికాయ కొట్టేస్తే జక్కన్న అతని ఫిట్ నెస్ లో కూడా మార్పులు చేయవచ్చని సమాచారం.