అభిమానులు ఎప్పటినుండే ఎదురుచూస్తోన్న రాజమౌళి భారీ మల్టీస్టారర్ 'RRR'నిన్న పూజా కార్యక్రమాలు జరుపుకొన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శకధీరుడు రాజమౌళి రూపొందించనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమాకి ఎవరెవరు టెక్నీషియన్లుగా పని చేయనున్నారనే విషయంపై నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఓ క్లారిటీ ఇచ్చింది. ఎప్పటిలానే రాజమౌళి సినిమాలకు పని చేసే టెక్నీషియన్లు ఈ సినిమాకి కూడా పని చేస్తున్నారు. రాజమౌళి తండ్రి విజేంద్రప్రసాద్ ఈ సినిమాకి కథ అందిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జక్కన్నతో ఎంతో కాలంగా ట్రావెల్ అవుతున్న సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ ఈ సినిమాకి పని చేయనున్నారు. 

బాహుబలి ఫస్ట్ పార్ట్ కి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పని చేసిన శ్రీనివాస్ మోహన్, బాహుబలి రెండు భాగాలకి పని చేసిన ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఈ సినిమాకి పని చేయనున్నారు. ఈసారి ఎడిటర్ మాత్రం మారారు. ఎప్పుడూ కోటగిరి వెంకటేశ్వరరావు.. రాజమౌళి సినిమాలకు ఎడిటర్ గా పని చేస్తూ వచ్చారు. కానీ ఈసారి శ్రీకర్ ప్రసాద్ ని ఎంపిక చేసుకున్నారు. 

కాస్ట్యూమ్ డిజైనర్ గా రమా రాజమౌళి, డైలాగ్స్ కోసం సాయి మాధవ్ బుర్రా, తమిళ రచయిత మదన్ కార్కీ పని చేయనున్నారు. ప్రస్తుతం టెక్నీషియన్ల విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమాలో కాస్టింగ్ కి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సివుంది!

ఇవి కూడా చదవండి..

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు