MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • త్రిష ఇంట్లో కూర్చుంటే బెటర్, బయటకి వస్తే సమస్యలు తప్పవు..నటుడి కామెంట్స్, ఎలా కౌంటర్ ఇచ్చిందో తెలుసా

త్రిష ఇంట్లో కూర్చుంటే బెటర్, బయటకి వస్తే సమస్యలు తప్పవు..నటుడి కామెంట్స్, ఎలా కౌంటర్ ఇచ్చిందో తెలుసా

Trisha and Parthiban Controversy: ఒక అవార్డుల కార్యక్రమంలో నటుడు పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నటి త్రిష గట్టిగా బదులిచ్చారు. ఆ వివరాలు ఈ గ్యాలరీలో చూద్దాం.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 09 2026, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Trisha Befitting Reply to Parthiban
Image Credit : X

Trisha Befitting Reply to Parthiban

ఒక తమిళ మీడియా అవార్డుల వేడుకలో, నటుడు పార్థిబన్.. త్రిషను కించపరిచేలా మాట్లాడటం వివాదంగా మారింది. దీనిపై ఇప్పుడు త్రిష గట్టిగా బదులిచ్చారు. పార్థిబన్ పేరు గానీ, విషయం తెలిసిన వాళ్లకు అర్థమయ్యేలా ఆమె పోస్ట్ ఉంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' ద్వారా త్రిష తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆమె పోస్ట్ కోలీవుడ్‌లో కలకలం రేపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్క్రీన్‌పై త్రిష ఫోటో
Image Credit : Asianet News

స్క్రీన్‌పై త్రిష ఫోటో

ఓ స్టేజీపై మాట్లాడుతున్నప్పుడు, యాంకర్లు ఒక్కో నటుడి గురించి, వారి పాత్రల గురించి పార్థిబన్‌ను అడిగారు. అప్పుడు 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలోని త్రిష 'కుందవై' పాత్ర గురించి ప్రశ్నించారు. అదే సమయంలో, వెనుక స్క్రీన్‌పై త్రిష ఫోటో కూడా చూపించారు. దీనికి పార్థిబన్ ఇచ్చిన సమాధానమే వివాదానికి కారణమైంది.

34
ఇంట్లోనే ఉండమని చెప్పడం మంచిది
Image Credit : Google

ఇంట్లోనే ఉండమని చెప్పడం మంచిది

"కుందవైని ఇంట్లోనే ఉండమని చెప్పడం మంచిది. ఆమె బయటకు రాకుండా ఉంటేనే బెటర్. బయటకు వస్తే చాలా సమస్యలు వస్తాయి" అని పార్థిబన్ అన్నారు. ఇటీవల నిర్మాత కల్పాతి ఎస్. సురేష్ కొడుకు పెళ్లి రిసెప్షన్‌కు విజయ్, త్రిష కలిసి హాజరయ్యారు. దీన్ని ఉద్దేశించే పార్థిబన్ అలా మాట్లాడారని విమర్శలు వచ్చాయి. విజయ్ భార్య సంగీత, మరో నటితో సంబంధం ఉందంటూ విడాకుల కోసం కేసు వేశారని, ఆ నటి త్రిషనే అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. విజయ్, త్రిష కలిసి కనిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Seriously. Is this right ? How’s this man allowed to get away by this and what rights have the organisers got to exhibit this on stage ? @khushsundar @realradikaa @sandhyaravishan @TheBluePen25 @KasthuriShankar pic.twitter.com/0OjB9sTkj0

— kishore k swamy 🇮🇳 (@sansbarrier) March 8, 2026

44
త్రిషకు క్షమాపణ
Image Credit : X

త్రిషకు క్షమాపణ

పార్థిబన్ వ్యాఖ్యలకు త్రిష గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో, ఒక వ్యక్తి అసిస్టెంట్ అడగడం వల్లే నా పేరు, ఫోటో వాడినట్లు నిర్వాహకులు చెప్పారు. మైక్‌లో మాట్లాడినంత మాత్రాన ఒక అభిప్రాయం తెలివైనదిగానో, ఫన్నీగానో అయిపోదు. అది తెలివితక్కువతనాన్ని గట్టిగా అరిచి చెప్పినట్లు అవుతుంది. నాసిరకమైన మాటలు మాట్లాడేవారి గురించే ఎక్కువ చెబుతాయి కానీ, ఎవరిని అన్నారో వారి గురించి కాదు" అని త్రిష 'X'లో పోస్ట్ చేశారు. దీని తర్వాత పార్థిబన్ తన వ్యాఖ్యలకు త్రిషకు క్షమాపణ చెబుతూ ఆడియో విడుదల చేయడం గమనార్హం.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Related Stories
Recommended image1
Hate Campaign: నన్ను తొక్కేయాలని చూశారు.. సంచలన నిజాలు బయటపెట్టిన ఓజీ హీరోయిన్
Recommended image2
ఒకవైపు స్నేహితుడు, మరోవైపు దళపతి విజయ్ తండ్రి.. ఇద్దరి కోసం కథ కూడా వినకుండా బ్లాక్ బస్టర్ కొట్టిన చిరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved