నేషనల్ మీడియా కూడా ఒక్కసారిగా జక్కన్న ప్రాజెక్ట్ పై పడింది. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే మాములు విషయం కాదు. ఇతర ఇండస్ట్రీ లో కూడా ఈ సినిమా బిజినెస్ ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. ఇకపోతే షూటింగ్ ఈ వీక్ లో మొదలుకానుంది. అయితే ఇప్పటికే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. 

తెలుగులో దాదాపు అన్ని ఏరియాల్లో సినిమాకు సంబందించిన డీల్స్ సెట్టయినట్లు మంచి ఎమౌంట్ కూడా నిర్మాతకు అందినట్లు సమాచారం. అసలైతే 200కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. కానీ సినిమా బిజినెస్ వరల్డ్ వైడ్ గా 500 కోట్ల దాటేస్తోందని సమాచారం. 

ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు గాని చాలా వరకు నిర్మాతకు సొంతంగా ఖర్చు చేసే అవకాశం లేదని తెలుస్తోంది. అడ్వాన్స్ లు కొన్ని రాగా ఫుల్ ఎమౌంట్ ఇచ్చిన వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. మొత్తంగా తెలుగులో ఎప్పుడు లేని విధంగా RRR భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోందని చెప్పవచ్చు.