ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ‘బాహుబలి’ తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే సినిమా అంటే ఎక్సపెక్టేషన్స్ ఎలా ఉంటాయో మనకు తెలియంది కాదు.   అందుకు తగినట్టుగానే ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటూ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్  పనులు దాదాపు పూర్తికాగా,  ఈ రోజు అంటే నవంబరు 11న ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభాస్‌ , చిరంజీవి ముఖ్య అతిథిలుగా వచ్చారు. 

అయితే ఈ చిత్రం ప్రారంభం జరిగిన వెంటనే అభిమానులకు కలిగిన ఓ సందేహం..ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది. షూటింగ్ కు ఎంతకాలం పడుతుంది అని. ఈ విషయానికి ఎవరూ సమాధానం చెప్పకపోయినప్పటికీ...ఓ చిన్న క్లూ ద్వారా..సినిమా మినిమం రెండేళ్లు పైగా పట్టేటట్లు ఉందని తెలిస్తోంది. ఆ క్లూ ఏమిటీ అంటే...ఈ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఉన్న  అల్యూమినియం ఫ్యాక్టరీని రాజమౌళి మూడేళ్ల పాటు లీజ్‌కు తీసుకున్నారని సమాచారం. 

అలాగే రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘RRR’ (వర్కింగ్‌ టైటిల్‌) అంటే అందరూ అనుకుంటున్నట్లు రాజమౌళి, రామారావు, రామ్‌చరణ్‌ మాత్రమే కాదని అంటున్నారు. అదేమిటంటే...‘రామ రావణ రాజ్యం’మట. అంతేకాదు, ‘తారక్‌రామ్‌’ అనే టైటిల్‌ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే, దీనిపై దర్శక,నిర్మాతల  నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. 

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ‘RRR’ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంభందించిన ..మిగిలిన నటీనటులు, చిత్రయూనిట్  వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. 

 

ఇవి కూడా చదవండి.. 

RRR: రాజమౌళిని ఓ ఆటాడుకున్న ప్రభాస్ - రానా..!

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు