సౌత్ ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ RRR. సినిమా లాంచ్ అయినప్పటి నుంచి నేషనల్ వైడ్ గా సినిమా గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. దర్శకదీరుడు రాజమౌళి బాహుబలితో బాలివుడ్ మీడియాను తనవైపుకు తిప్పుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడంతో అనేక తరహాలో నార్త్ మీడియా కథనాలను అల్లెస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబందించిన హీరోయిన్స్ విషయంలో కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి. అయితే ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి తీసుకోవాలని రాజమౌళి కి రికమండేషన్ వచ్చిందట. ఆయనతో వర్క్ చేయడానికి అక్కడి స్టార్ హీరోయిన్స్ ముందు నుంచి సిద్ధంగా ఉన్నారు.

అయితే శ్రీదేవి కూతురు జాన్వీ కంప్యూర్ ని జక్కన్న ఒకా కథానాయికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను ఎంచుకోవడానికి కారణం కరణ్ జోహార్ అని టాక్ కూడా వస్తోంది. బాలీవుడ్ లో బాహుబలి విజయం సాధించడానికి ప్రధానం కారణం కరణ్ జోహారే.. ఆయన సొంత ప్రొడక్షన్ ధర్మ బ్యానర్ లో సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కి సహాయపడ్డారు. 

అయితే జాన్వీ కపూర్ కెరీర్ ను చూసుకుంటూ గాడ్ ఫాదర్ లా ఉన్న కరణ్ RRR హీరోయిన్స్ విషయంలో రాజమౌళితో మాట్లాడినట్లు తెలుస్తోంది. సినిమాను బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ పరంగా కరణ్ జోహార్ సహాయం కూడా అవసరం. అందువల్ల ఇద్దరి మధ్య ఒప్పందం కుదరడంతో జాన్వీ ని హీరోయిన్ గా ఎంచుకోవాలని కరణ్ సూచించినట్లు సమాచారం. 

ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా నిర్దారణ కాలేదు గాని కరణ్ జోహార్ అవసరం రాజమౌళికి ఎంతైనా ఉందని గ్రహించవచ్చు. RRR కోసం దాదాపు 200కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. రాజమౌళికి నార్త్ లో కూడా డిమాండ్ ఉంది కాబట్టి తప్పకుండా హిందీలో డబ్ చేస్తారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కరణ్ జోహార్ లాంటి వారి హోమ్ ప్రొడక్షన్ నుంచి సినిమా రిలీజైతే కలెక్షన్స్ లో RRR సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. అందుకే కరణ్ నిర్ణయానికి జక్కన్న ఒకే చెప్పినట్లు టాక్.