సౌత్ సినీ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం RRR. ఇటీవల మొదటి షెడ్యూల్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక చిత్ర యూనిట్ సభ్యులు రాజమౌళి తనయుడి వివాహం ఉండడంతో కాస్త గ్యాప్ తీసుకున్నారు. కార్తికేయ వివాహ వేడుకలో రాజమౌళి ఎంతగా ఎంజాయ్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇన్ని రోజులు కుటుంబంతో హ్యాపీగా హాలిడేస్ ని ఎంజాయ్ చేశాడు. అలాగే రామ్ చరణ్ తన వినయవిధేయ రామ ప్రమోషన్స్ తో బిజీగా గడిపాడు. మొత్తానికి RRR సెకండ్ షెడ్యూల్ కి సమయం దగ్గర పడటంతో అందరూ మళ్ళి వర్క్ మోడ్ లోకి రానున్నారు. ఇటీవల హీరోలతో ఫోన్ లో మాట్లాడిన జక్కన్న సెకండ్ షెడ్యూల్ కి సిద్ధమా అని అడిగారట. సెకండ్ షెడ్యూల్ ఈ నెల 21నుంచి స్టార్ట్ కానుంది.  

సినిమాలో ఎన్టీఆర్ రఫ్ లుక్ లో కనిపించనుండగా చరణ్ ఎలాంటి మార్పులు లేకుండా నార్మల్ లుక్ తో కనిపిస్తాడట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఈ విషయాన్నీ చెప్పాడు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి.దానయ్య నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే హీరోయిన్స్ కి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.