టాలీవుడ్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్‌ #RRR పై రోజుకో వార్త వస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి నటించనున్న ఈ మల్టీస్టారర్ రీసెంట్ గానే లాంచింగ్‌  చేసారు. సినిమా లాంచ్  అవ్వడమే ఆలస్యం అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ విషయం గమనించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఏం రేంజిలో కష్టపడాలో అని లెక్కలేసుకుని రంగంలోకి దూకేసారు. అందుతున్న సమాచారం బట్టి వీళ్లిద్దరూ ఉదయమే అల్యూమినియం ఫాక్టరీలో కత్తిసాము ప్రాక్టీస్ చేస్తున్నట్లు సమాచారం.  సినిమాలో ఓ కీలకమైన ఎపిసోడ్ గా వీళ్లిద్దరూ కత్తులు దూస్తారు. 

ఏదో ఫైట్ మాస్టర్ చెప్పినట్లు ఆ సమయానికి మమ అనిపించేయకుండా రియల్ కత్తిసాము ఎలా ఉంటుందో చూపెట్టాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారట. దానికి తగ్గట్లుగా నిపుణులని రప్పించి ప్రాక్టీస్ చేయిస్తున్నారట. దాంతో ఉదయమే రెండు గంటలు సేపు ప్రాక్టీస్ చేస్తూ ఈ హీరోలిద్దరూ చెమటలు కక్కుతున్నారని వినికిడి. ఫస్ట్ షెడ్యూల్..ఈ ఎపిసోడ్ తోనే మొదలుపెట్టనున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ హైలెట్ గా నిలవాలని రాజమౌళి భావిస్తున్నారు.  ఈ ఎపిసోడ్ సినిమాలో కీలకమైన ఇంటర్వెల్‌ సీన్‌ అంటున్నారు.  ఈ ఒక్క సీన్‌నే దాదాపు నెలా పదిహేను  రోజుల పాటు తెరకెక్కించేందుకు ప్లాన్‌ చేసారు. ఈ ఎడిసోడ్‌లో ఊహిందని విధంగా ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటుంది టాక్‌  . 

అలాగే,... ఈ చిత్రం సెట్ ని   ప్రముఖ ఆర్ట్ డైరక్టర్ సబు సపర్యవేక్షణలో వేయించారు. ఇక ఈ కథ 1920  ప్రాంతంలో జరుగుతుందని, పీరియడ్ సినిమా అని తెలుస్తోంది. బ్రిటీష్ వాళ్ల టైమ్ లో జరిగే పీరియడ్ సినిమా కాబట్టి దేశభక్తి మిళితమై ఉంటుందనటంలో సందేహం లేదు. అంతేకాదు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారట.  వారిలో ఒకరు విదేశీ హీరోయిన్‌ అన్న వార్తలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. మరి వార్తలపై చిత్రయూనిట్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి.