రోజుకో ట్రైలర్ టాలీవుడ్ లో రిలీజ్ అవుతున్నా...అందరి దృష్టీ ...ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ మీదే ఉందన్న సంగతి తెలిసిందే.  రీసెంట్‌గా ఈ చిత్ర ట్రైలర్‌ను డిసెంబర్ 16న, ఆడియోను డిసెంబర్ 21న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన చిత్ర టీమ్, తాజాగా ట్రైలర్ విడుదల కూడా ఆడియో విడుదల రోజే ఉంటుందని అఫీషియల్‌గా ప్రకటించారు. దాంతో ట్రైలర్ రిలీజ్ డేట్ ఎందుకు మార్చారనే సందేహం మొదలైంది. 

అయితే టాలీవుడ్ ఇన్ సైడ్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఇప్పటికే కట్ చేసిన ట్రైలర్ ని చూసిన బాలకృష్ణ, క్రిష్  రీ ఎడిట్ చేయమన్నట్లు సమాచారం. ఆ ట్రైలర్ అభిమానుల ఎక్సపెక్టేషన్స్ ని రీచ్ కాదని, తేలిపోతుందని భావించారట. సినిమా మీద కన్నా ట్రైలర్ మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయని క్రిష్ భావించి..చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఏ మాత్రం ట్రైలర్ తేడా వచ్చినా ఆ ఇంపాక్ట్...సినిమా ఓపినింగ్స్ పై పడుతుంది. అంతేకాదు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయటానికి రెడీ గా ఉన్న బ్యాచ్ కు అవకాసం ఇచ్చినట్లు అవుతుంది. సోషల్ మీడియా రోజుల్లో ప్రతీ విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేయాల్సి వస్తోందని బాలయ్య, క్రిష్ డిస్కస్ చేసుకుని రీ ఎడిట్ చేయమని పురమాయించి, తాము అనుకున్న ఇంపాక్ట్ తో ట్రైలర్ వచ్చాదాకా మార్పులు చేయబోతున్నారని వినికిడి.

ఎన్టీఆర్ బ‌యోపిక్ ట్రైల‌ర్ మ‌రియు ఆడియో లాంఛ్ వేడుక‌లు డిసెంబ‌ర్ 21న జ‌ర‌గ‌నున్నాయి. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విద్యాబాల‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రిష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. జ్ఞాన‌శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధ‌వ్ బుర్రా మాట‌లు రాస్తున్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్.. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు.. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడుగా రెండు భాగాల్లో రానుంది.

నందమూరి బాల‌కృష్ణ, విద్యాబాల‌న్, రానా ద‌గ్గుపాటి, నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్, సుమంత్, ర‌కుల్ ప్రీత్ సింగ్, లెజెండ‌రీ కైకాల స‌త్య‌నారాయ‌ణ, నిత్యామీన‌న్.. తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

ఎన్టీఆర్ కి పోటీగా 'యాత్ర'.. తప్పు చేస్తున్నారా..?

బాలయ్య.. ఎన్టీఆర్ ని పిలుస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్.. చిన్న చేంజ్ ఏమిటంటే?

ఎన్టీఆర్ సినిమా సెట్ లో మోక్షజ్ఞ!

ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఆలస్యానికి కారణమిదేనా..?

ఎన్టీఆర్ లో తెలుగమ్మాయి.. ట్విస్ట్ లో దర్శనమిస్తుందట?

ఎన్టీఆర్ బయోపిక్.. ఆ తారలకు నో డైలాగ్స్!

షాకిచ్చే రేటుకు 'ఎన్టీఆర్' బయోపిక్ ఆడియో రైట్స్

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!