నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ మధ్య సినిమా షూటింగ్ జరుగుతున్న లొకేషన్ కి బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్  మొదలైన తరువాత మోక్షజ్ఞ ఈ సినిమా షూటింగ్ కి వెళ్లడం ఇదే మొదటిసారి కావడంతో షూటింగ్ వాతావరణం మొత్తం సందడితో నిండిపోయిందట. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది.

సినిమా సెట్స్ ని చూడడానికి మోక్షజ్ఞ అక్కడకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మోక్షజ్ఞ ఓ స్పెషల్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని, ఈ సినిమాతోనే అతడు సినీరంగ ప్రవేశం చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి.

కానీ ఈ విషయంపై చిత్రబృందం స్పందించలేదు. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమా సెట్స్ లో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరుతుంది. కానీ యూనిట్ సభ్యులు మాత్రం మోక్షజ్ఞ షూటింగ్ చూడడానికే సెట్స్ కి వచ్చాడని అంటున్నారు.