నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో బాలయ్య రకరకాల గెటప్పులలో కనిపించనున్నాడు. అందులో అల్లూరి సీతారామరాజు ఒకటి. దివంగత ఎన్టీఆర్ కి బాగా ఇష్టమైన పాత్రల్లో సీతారామరాజు ఒకటి. 

అల్లూరి జీవితాన్ని సినిమాగా తీయాలని ఎన్టీఆర్ అనుకున్నారు. కానీ అతడికి పోటీగా కృష్ణ ఆ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. కృష్ణ నటించిన 'అల్లూరి సీతారామరాజు' సినిమా ఎన్టీఆర్ కి నచ్చడంతో ఇక ఆ కథతో మళ్లీ సినిమా చేయలేదు.

'మేజర్ చంద్రకాంత్' సినిమాలో వివిధ గెటప్పులు వేసే సమయంలో అల్లూరి గెటప్ కూడా వేసుకొని తన కోరిక తీర్చుకున్నాడు.ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా 'అల్లూరి సీతారామరాజు' ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. దానికోసం బాలయ్య అల్లూరి గెటప్ లోకి మారబోతున్నాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అల్లూరి గెటప్ లో బాలయ్యతో క్రిష్ ఓ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీపావళి కానుకగా ఈ లుక్ ని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ బయోపిక్ రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ