నందమూరి అభిమానులు మాత్రమే కాదు..సినిమా ప్రియులందరి దృష్టి ఇప్పుడు 'ఎన్టీఆర్' బయోపిక్ పైనే వుంది.  ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చేస్తూనే క్రిష్ ..ఈ సినిమాకు చెందిన ఫొటోలు రిలీజ్ చేస్తూ హల్ చల్ సృష్టిస్తున్నారు. దానికి తోడు  ఈ సినిమా కోసం హన్సికను .. పాయల్ రాజ్ పుత్ ను తీసుకోవడంతో, ఈ సినిమాపై అందరిలోను మరింతగా ఆసక్తి పెరిగిపోతోంది.  దాంతో ఈ సినిమాపై క్రేజ్ ఆకాశాన్ని అంటుతోంది. దాంతో అదే స్దాయిలో బిజినెస్ సైతం జరుగుతోంది.  ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ...ఈ సినిమా ఆడియో హక్కులను 'లహరి' సంస్థ సొంతం చేసుకుంది. ఈ రైట్స్ ని  ఆ సంస్థ 2 కోట్లు  ఇచ్చి తీసుకుంది. వాస్తవానికి  ఆడియో మార్కెట్ ఇప్పుడు లేదు. ఆడియో అమ్మకాలు తగ్గిపోయి చాలాకాలమే అయింది. అయితే  ఆన్ లైన్ ఫ్లాట్ ఫారమ్ లకు విడివిడిగా రైట్స్ ఇవ్వడం ద్వారా లాభాలు బాగానే వస్తున్నాయి. ఆడియో బాగుంటే ఆన్ లైన్ ఆదాయం బాగుంటుందని, అందులోనూ క్రేజీ ప్రాజెక్టు అని.., 'లహరి' సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది.

ఈ ఉషారులో టీమ్  ఈ చిత్రం ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.  డిసెంబర్ 16న తిరుపతిలో నిర్వహించే ఆ ఈవెంట్ కు రాజకీయ ప్రముఖుల్ని అలాగే ఇతర ప్రముఖ సినీ నటులను ముఖ్య అతిధులుగా ఆహ్వానించాలని అనుకుంటున్నారు. అందుకోసం నిర్మాత సాయి కొర్రపాటి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ 16వ తేదీన తిరుపతిలో ఆడియో వేడుకను నిర్వహించనున్నారట.

విద్యా బాలన్, రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో 66 గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో హన్సిక.. ఏ పాత్రంటే..?

ఎన్టీఆర్ బయోపిక్.. ఎన్నికల తరువాతే!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ప్రీరిలీజ్ ఫంక్షన్ కి భారీ ప్లాన్!

ఎన్టీఆర్ లవ్ స్టోరీ చూపించరా..?

ఎన్టీఆర్ బయోపిక్.. సెకండ్ పార్ట్ లో స్టార్ హీరోలు!

'ఎన్టీఆర్ బయోపిక్' లో కృష్ణకుమారిగా ఆమెనే ఫైనల్

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!