దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఒక భాగం సినిమా షూటింగ్ పూర్తయింది. రెండో భాగం చిత్రీకరణ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో నందమూరి హీరోలు ఎవరెవరు నటిస్తున్నారనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. టైటిల్ పాత్రలో బాలయ్య నటిస్తుండగా.. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు.

బాలయ్య తనయుడు మోక్షజ్ఞ నటిస్తారనే వార్తలు వచ్చినా.. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అలానే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. యంగ్ బాలయ్య పాత్రలో తారక్ కనిపిస్తాడని అన్నారు. కానీ ఇప్పటికే షూటింగ్ సగం పూర్తయింది కాబట్టి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చే అవకాశం ఉందని మరికొందరు అన్నారు.

అయితే ఈ విషయాలకు సంబంధించి దర్శకుడు క్రిష్ నుండి క్లారిటీ వచ్చింది. అన్ని పాత్రలు ఇప్పటికే ఫుల్ అయ్యాయని తారక్ ని ఏ పాత్రకి తీసుకోవడం లేదని అన్నారు. అలానే వాయిస్ ఓవర్ ఇచ్చే ఛాన్స్ కూడా లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి సంబంధించి తారక్ ని ఏ విషయంలోనూ సంప్రదించలేదని క్లారిటీ ఇచ్చారు. సో.. ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ టైగర్ లేడన్నమాట!

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ