Shreya Ghoshal: ఆ పాట నాకు సెట్ అవ్వదనుకున్నా.. కానీ నా వాయిసే కరెక్ట్ అయింది!
ఇటీవల శ్రేయా ఘోషల్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్ లాంటి స్టార్స్ ఉన్న 'దేవదాస్' సినిమాలో పాడినా.. ఆ తర్వాత వెంటనే పెద్ద ఆఫర్లు రాలేదని ఆమె గుర్తుచేసుకున్నారు.
18

Image Credit : instagram
నేను సెట్ కాను అనుకున్నా
‘జాదూ హై నషా హై’ పాటకు నేను సెట్ కాను అనుకున్నా! బాలీవుడ్ 'మెలోడీ క్వీన్' శ్రేయా ఘోషల్ గొంతుకు ఫిదా కాని వారుండరు. సంజయ్ లీలా భన్సాలీ 'దేవదాస్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన శ్రేయా, తొలి సినిమాలోనే ఐదు పాటలు పాడి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. కానీ, ఇంత అద్భుతమైన ఆరంభం తర్వాత కూడా శ్రేయా అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింది!
Add Asianetnews Telugu as a Preferred Source

28
Image Credit : our own
శ్రేయా ఘోషల్ తన కెరీర్ తొలినాళ్ల సంగతులు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రేయా ఘోషల్ తన కెరీర్ తొలినాళ్ల సంగతులు పంచుకున్నారు. 'దేవదాస్ సినిమా తర్వాత నాకు వెంటనే పెద్ద ఆఫర్లు రాలేదు' అని ఆమె చెప్పారు.
38
Image Credit : our own
చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది
షారుఖ్ ఖాన్, మాధురీ దీక్షిత్ లాంటి పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలో పాడినా, నా తర్వాతి పెద్ద అవకాశం కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చింది. నేను పని కోసం ఎవరికీ రోజూ ఫోన్ చేసేదాన్ని కాదు. సరైన సమయం, సరైన పాట కోసం ఎదురుచూశాను' అని ఆమె వివరించారు.
48
Image Credit : our own
శ్రేయా ఎందుకు భయపడింది?
బిపాషా బసు పాట పాడటానికి శ్రేయా ఎందుకు భయపడింది? 'దేవదాస్' తర్వాత శ్రేయాకు పెద్ద బ్రేక్ ఇచ్చింది 'జిస్మ్' సినిమాలోని 'జాదూ హై నషా హై' పాట. ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్‌లో ఒకటి. కానీ, ఈ పాట పాడేటప్పుడు శ్రేయాకు ఓ పెద్ద సందేహం ఉండేదట! ఆ పాటకు తాను 'మిస్‌ఫిట్' అనే ఫీలింగ్ ఆమెలో ఉండేది.
58
Image Credit : our own
బిపాషా బసు లాంటి బోల్డ్, గ్లామరస్ నటికి..
బిపాషా బసు లాంటి బోల్డ్, గ్లామరస్ నటికి తన గొంతు సెట్ అవుతుందా లేదా అని శ్రేయా ఆందోళన చెందారు. 'బిపాషా బసుకు నేను మిస్‌ఫిట్ అనిపించింది. కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి గారు మాత్రం నా వాయిసే కావాలని పట్టుబట్టారు' అని శ్రేయా చెప్పారు.
68
Image Credit : instagram
నా వయసు కేవలం 18 ఏళ్లు
ఆ పాట పాడేటప్పుడు నేను 'సెన్సువస్'గా పాడటానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే అది నాకు సహజంగా రాలేదు. అప్పుడు నా వయసు కేవలం 18 ఏళ్లు. ఆ వయసులోని అమాయకత్వం ఆ పాటలో ఉంది' అని శ్రేయా గుర్తుచేసుకున్నారు.
78
Image Credit : instagram
ఎం.ఎం. కీరవాణి
ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి గారు ఆ రోజు శ్రేయా గొంతుపై ఉంచిన నమ్మకం నిజమైంది. అమాయకమైన గొంతుతో వచ్చిన ఆ పాట, బిపాషా బసు బోల్డ్ నటనకు పర్ఫెక్ట్ కాంప్లిమెంట్‌గా నిలిచింది. దీంతో శ్రేయా ఘోషల్ కేవలం క్లాసికల్ పాటలే కాదు, మోడ్రన్, బోల్డ్ పాటలు కూడా అద్భుతంగా పాడగలదని నిరూపించుకుంది.
88
Image Credit : instagram
శ్రేయా సంగీత ప్రయాణం
మొత్తం మీద, 'దేవదాస్'తో మొదలైన శ్రేయా సంగీత ప్రయాణం, నేటికీ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతోంది. 'ప్రతి పాటకు దాని సొంత 'క్యాస్టింగ్' ఉంటుంది, అది సరైన సమయంలో జరిగినప్పుడే మ్యాజిక్ క్రియేట్ అవుతుంది' అన్న శ్రేయా మాటలు అక్షరాలా నిజం. ఈ రోజు శ్రేయా ఘోషల్ కేవలం ఒక గాయని మాత్రమే కాదు, భారతీయ సినిమా గర్వించదగ్గ గాయని!
Latest Videos

