ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ వేగంగా జరుగుతూ రోజుకో వార్తతో మీడియా వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ చిత్రం కీలకమైన  పాత్ర నారా చంద్రబాబు క్యారెక్టర్లో దగ్గుబాటి రానా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ నేఫధ్యంలో ఇప్పటికే రానా చంద్రబాబును కలిసి అయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడని...  బాబు క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది దగ్గరినుంచి విలువైన సమాచారాన్ని తీసుకుంటున్నాడని మీడియాలో వార్తలు హల్ చల్ చేసాయి.

అంతేకాదు చంద్ర  బాబు తన మామగారైన ఎన్టీఆర్ తో ఎలా మాట్లాడేవారు.  ఎలా ఉండేవాడు అనే విషయాలు తెలుసుకుంటున్నారని అన్నారు. అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఓ కొత్త వార్త వినిపిస్తూ అందరికీ షాక్ ఇస్తోంది. అదేమిటంటే...ఈ సినిమాలో కేవలం రానా పాత్ర ఒక్క సన్నివేశానికే పరిమితం అవుతుందని. 

అయితే ఆ సన్నివేశం సినిమాకు ప్రాణం. అప్పట్లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచిన ఎమ్మల్యేలని డిల్లీకు తీసుకు వెళ్లి బలనిరూపణ చేసారు. మామగారి ఆదేశాల మేరకు చంద్రబాబు ఆ ఎమ్మల్యేలని క్షేమంగా తీసుకువెళ్లటంలో కీలక పాత్ర వహించారు. అయితే ఈ జర్నీలో కొందరు కాంగ్రేస్ కార్యకర్తలు దాడి చేసారు. అప్పుడు చంద్రబాబు చొరవ తీసుకుని తను,తనతో పాటు ఉన్న వారిని క్షేమంగా బయటపడేలా చేసారు. ఇదో యాక్షన్ సీన్ లా సాగుతుంది. ఈ సీన్ లో రానా కనపడి అలరిస్తారు. రానాపై మరో రెండు సీన్స్ అనుకున్నప్పటికి అవి..ప్రస్తుతానికి అయితే వద్దనుకుంటున్నారట. ఈ చిత్రం సెకండ్ పార్ట్ అంటే మహానాయకుడులో ఈ సీన్ వస్తుంది. 

ఇక గెటప్ పరంగా ..చంద్రబాబు యువకుడుగా ఉండగా అంటే తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో ఎలా ఉండేవారో అప్పటి ఆ చంద్రబాబులా రానాను మేకప్ చేసారట.   పొడవైన మీసాలతో గడ్డం లేకుండా ఉండే గెటప్ లో రానా కనిపిస్తున్నారు.  ఆ మధ్యన ఈ గెటప్ కు సంభందించి ఓ ఫోటో సోషమీడియాలో పోస్ట్ అయింది.  చంద్రబాబు అప్పట్లో   ఉన్నప్పుడు ఎలా ఉండేవారో దాదాపుగా రానా అలాగే సెట్ అయ్యాడని అంతా మెచ్చుకున్నారు.