నందమూరి తారకరామారావు గారి బయోపిక్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా ముందుకు సాగుతోంది. ఈ డిసెంబర్ లోనే సినిమాకు సంబందించిన అన్నిపనులలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనీ దర్శకుడు క్రిష్ కష్టపడుతున్నాడు. రీసెంట్ గా కథానాయక పాటతో ఫస్ట్ పార్ట్ పై అంచనాలు పెంచారు. 

ఇక రెండవ పార్ట్ మహానాయకుడు తాలూకు పోటోలను పాటలను కూడా విడుదల చెయ్యాలని అనుకుంటున్నారు.  ఈ నెల డిసెంబర్ 12న 10.31నిమిషాలకు 'రాజర్షి' అనే పాటను విడుదల చేయనున్నారు. అసలైతే సోమవారం సాయంత్రం విడుదల చేయనున్నట్లు చెప్పిన చిత్ర యూనిట్  మళ్ళీ డేట్ ను చేంజ్ చేసింది. 12వ తేదీన సాంగ్ ను విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. ఇక ఇదే నెలలో బయోపిక్ కి సంబందించిన పూర్తి పాటలను రిలీజ్ చేయనున్నారు.  

ఎమ్ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బాలకృష్ణ వారాహి ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలో మొదటి పార్ట్ ను రిలీజ్ చేసి జనవరి లాస్ట్ వీక్ లో రెండవ పార్ట్ ని విడుదల చేయనున్నారు.