నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

సాధారణంగా బయోపిక్ అంటే మేకర్స్ పాజిటివ్ సైడ్ చూపించడానికే ఇష్టపడతారు. క్రిష్ కూడా అదే ఫాలో అవుతూ సినిమాలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి గురించి ప్రస్తావించడం లేదని అన్నారు.

కానీ వాటిల్లో నిజం లేదని తెలుస్తోంది. క్రిష్ ఈ బయోపిక్ లో లక్ష్మీపార్వతి ప్రస్తావన తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లక్ష్మీపార్వతి రోల్ లో సీనియర్ హీరోయిన్ ఆమనిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల మధ్య చిత్రీకరించబోయే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు.

ముఖ్యంగా ఎన్టీఆర్ కోసం లక్ష్మీపార్వతి స్వయంగా రాసి వినిపించే కవిత సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. మరి నిజంగానే ఎన్టీఆర్ బయోపిక్ లో దర్శకుడు క్రిష్.. లక్ష్మీపార్వతికి స్థానం ఇచ్చాడో లేదో.. చిత్రబృందం నుండి అధికార ప్రకటన రావాల్సివుంది!

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ