దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎన్టీఆర్ బాల్యం, సినిమాలు మొదటి పార్ట్ లో చూపిస్తే.. రాజకీయ ప్రయాణం రెండో భాగంలో చూపించనున్నారు.

అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి సంబంధించి అన్ని కోణాల్ని ఆవిష్కరించబోతున్నారు. ఎన్టీఆర్ కి జాతకాలంటే పిచ్చి. ఏ పనైనా శాస్త్ర ప్రకారం చేస్తుంటారు. ఆయనకి ఓ వ్యక్తిగత జోతిష్యుడు ఉండేవాడు.. అతడి పేరు భూతాల రాజు. ఎన్టీఆర్ తన ముఖ్యమైన పనులన్నీ భూతాల రాజు నిర్దేశించిన ముహుర్తానికే జరిపేవారు. 

ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా ఈ పాత్ర ఉంటుందట. ఎన్టీఆర్ కి జాతకాల మీదున్న ఆసక్తిని భూతాల రాజు పాత్ర ద్వారా చూపించబోతున్నారు. అలానే ఎన్టీఆర్ జీవితంలో అభిమానులకు ఎంతగా పెద్ద పీట వేశారో చూపించబోతున్నారు. 

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అభిమానుల్లో ముఖ్యుడు కుంటి సాయికి కూడా పదవి లభించింది. దాన్ని బట్టి ఆయన అభిమానులకి తన జీవితంలోఇచ్చిన స్థానమేంటో తెలుస్తోంది, సినిమాలో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. అయితే ఈ సన్నివేశాలు సినిమా రెండో భాగం మహానాయకుడిలో కనిపించనున్నాయి.  

సంబంధిత వార్తలు.. 

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ