టాలీవుడ్ లో ఇప్పుడిపుడే తెలుగమ్మాయిలు నార్త్ బ్యూటీలకు కొంచెం పోటీని ఇచ్చే విధంగా అడుగులు వస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నం చేసినా స్టార్ హీరోలతో జతకట్టలేకపోతున్నారు గాని సినిమాల్లో కీలక పాత్రలైతే చేస్తున్నారు. ఇప్పుడు ఈషా రెబ్బ అదే తరహాలో అవకాశాలను అందుకుంటోంది. 

అమ్మడు జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత లో ఒక పాత్రలో కనిపించి పరవాలేధనిపించింది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా కీలక పాత్రలో నటించినట్లు సమాచారం. దర్శకుడు క్రిష్ ఇటీవల బాలకృష్ణ - ఈషా రెబ్బ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమా మొదటి భాగంలో ట్విస్ట్ వచ్చే సమయంలో ఈషా క్యారెక్టర్ ఆకట్టుకుంటుందని టాక్.

అయితే అది జస్ట్ కామియో అని తెలుస్తోంది. ఆ అతిధి పాత్ర నిడివి తక్కువైనా ఈషా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందట. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. మొదటి పార్ట్ కథానాయకుడును సంక్రాంతికి రిలీజ్ చేయనున్న చిత్ర యూనిట్ సెకండ్ పార్ట్  మహానాయకుడును 2019 జనవరి లాస్ట్ వీక్ లో విడుదల చేయనుంది. సాయి కొర్రపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.