వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రతో 'యాత్ర' అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మొదటి నుండి ఈ సినిమా ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. అందుకే సినిమా రిలీజ్ డేట్ ని మారుస్తూ వస్తున్నారు.

ముందుగా జనవరిలో ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా వస్తుందని అన్నారు. ఆ తరువాత డిసంబర్ 21న విడుదల చేస్తామని అన్నారు. ఇప్పుడు మళ్లీ డిసంబర్, జనవరి కాదు ఫిబ్రవరి 8న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. ఇది కూడా ఎన్టీఆర్ సినిమాకు పోటీగానే అని తెలుస్తోంది. 'ఎన్టీఆర్' మహానాయకుడు సినిమా ఫిబ్రవరి 14న వస్తుందని అన్నారు

కానీ ఇప్పుడు ఆ సినిమా ఫిబ్రవరి 7న వస్తుందని తెలుసుకొని ఆ సినిమా విడుదలైన ఒకరోజుకి 'యాత్ర'ని తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తో పోలిస్తే యాత్రలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ లేవు. ఎన్టీఆర్ బయోపిక్ లో చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్లు ఉన్నారు. కానీ 'యాత్ర'లో మమ్ముట్టి తప్ప పేరున్న నటులు పెద్దగా లేరు.

ఏ ధైర్యంతో ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీగా విడుదల చేస్తున్నారనేది అర్ధం కాని పరిస్థితి. ఎన్టీఆర్ బయోపిక్ కి గనుక హిట్ టాక్ వస్తే దాని ముందు యాత్ర నిలవడం కష్టమవుతుంది. సినిమాకి సరిపడే డేట్ ని చూసి విడుదల చేయడం మానేసి పోటీకి వెళ్లి పరువు తీసుకుంటుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.