నందమూరి బాలకృష్ణ పెళ్లికొడుకు అవతారమెత్తి పెళ్లిపీటలెక్కాడు. ఈ వయసులో బాలయ్య పెళ్లి ఏంటని అనుకోకండి.. ఎందుకంటే అది సినిమా కోసం చేసుకున్న రీల్ పెళ్లి. బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ లో భాగంగా పెళ్లి పీటలెక్కాడట బాలయ్య. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ 'కథానాయకుడు', 'మహానాయకుడు' అనే పేర్లతో రెండు భాగాలు విడుదల కానున్నాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

కథలో భాగంగా ఎన్టీఆర్ జీవితంలోని పలు కీలక ఘట్టాలను చూపించబోతున్నారు. ఈ క్రమంలో బాలయ్య పెళ్లి వేడుక సన్నివేశం కూడా సినిమాలో  చూపించనున్నారు. ఇందులో భాగంగానే నిన్న(శుక్రవారం) బాలయ్య బాబుని పెళ్లి పీటలెక్కించి పెళ్లి సన్నివేశాలను చిత్రీకరించారట.

ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపించనుంది. రానా, రకుల్ ప్రీత్ సింగ్, సుమంత్ వంటి నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు.. 

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ