‘పాతాళ భైర‌వి’ చిత్రంలో గంధ‌ర్వ కాంత‌గా మెరిసి, ఎన్నో తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించిన‌ ప్రముఖ నటి కృష్ణకుమారి . ప్ర‌ముఖ సీనియ‌ర్ నటి షావుకారు జానకికి  కృష్ణకుమారి స్వ‌యానా చెల్లెలు.  1951లో  ‘నవ్వితే నవరత్నాలు’ చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన ఆమె తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. చూసేందుకు సావిత్రిలాగే ఉండ‌డం కూడా కృష్ణ‌కుమారికి క‌లిసి వ‌చ్చింది.

కృష్ణకుమారితో నందమూరి తారక రామారావుకు మంచి అనుబంధం ఉండేది. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక సినిమాలు ఘన విజయం సాధించాయి. దాంతో ఆమె ను మళ్లీ ఈ తరానికి గుర్తు చేయాలని ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ నిర్ణయించుకుంది.  ఆ జ్ఞాపకాలను ఈ తరానికి అందించాలని , ఆ మ్యాజిక్ ని రిట్రీవ్ చేసే పనిలో ఉందని సమాచారం. 

అయితే ఈ తరంలో కృష్ణకుమారిలా కనిపించే అందగత్తె ఎవరూ అని వెతకగా వారికి మళయాళ నటి మాళవిక నాయర్ కనిపించింది. వెంటనే ఆమెను సంప్రదించి డేట్స్ లాక్ చేసారు. అతి త్వరలోనే బాలయ్య, మాళవిక నాయర్  మధ్యా సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 

ఎన్టీఆర్ చిత్రం ఎన్టీఆర్ న‌ట‌, రాజ‌కీయ జీవితం నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.  స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు జీవిత నేప‌థ్యంలో క్రిష్ తెర‌కెక్కిస్తున్న ఎన్టీఆర్  చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి.

వచ్చే ఏడాది జ‌న‌వ‌రిలో రెండు పార్ట్‌లుగా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో ప‌లు పాత్ర‌ల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్ వారి వారి పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.  

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ