Asianet News Telugu

కోహ్లీకి సినీనటి కౌగిలి: మరిన్ని వార్తలు

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం

 

Top Stories of the day
Author
Hyderabad, First Published Jun 19, 2019, 6:20 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

 

చంద్రబాబు గుండెల్లో గుబులు: రంగంలోకి రాంమాధవ్, అసలుకే ఎసరు

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భయంతో గడుపుతున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లు ఫలితాలు రాబట్టిన చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్షనేతకు పరిమితమయ్యారు
 

హెలికాప్టర్ లో సచివాలయానికి జగన్: మహేష్ బాబు సినిమాలో లాగా...

మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి ఇంటి నుంచి సచివాలయం వెళ్లడానికి హెలికాప్టర్ వాడుతాడు. అదే రీతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి సచివాలయం వెళ్లడానికి హెలికాప్టర్ వాడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 

పార్టీ ఫిరాయింపులపై జేసి ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పార్టీ ఫిరాయింపులపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. డబ్బు కావాలనుకునే వారే పార్టీలు మారతారంటూ చెప్పుకొచ్చారు. తమకు ఆ అవసరం లేదని చెప్పుకొచ్చారు. 
 

మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా వాసిరెడ్డి పద్మ

వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మకు ఏపీ  మహిళ కమిషన్ చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టనున్నారు. త్వరలోనే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
 

వివస్త్రను చేసి ప్రయాణికురాలిపై రేప్: నగ్నంగా పరుగెత్తిన మహిళ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో దారుణమైన సంఘటన జరిగింది. ఓ ప్రయాణికురాలిని చీకట్లోకి లాక్కెళ్లి వివస్త్రను చేసి ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సంఘట మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన 50ఏళ్ల మహిళ ఉప్పు చేపల వ్యాపారం చేస్తోంది. 

 

'ఆర్ఎస్ఎస్'లో ప్రియాంక చోప్రా.. ఈ డ్రెస్సులేంటమ్మా!

ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్. బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న పీసీ హాలీవుడ్ లో కూడా నటిస్తోంది. అమెరికన్ కుర్రాడు, ప్రముఖ హాలీవుడ్ సింగర్ అయిన నిక్ జోనస్ ని బుట్టలో పడేసి పెళ్లి కూడా చేసేసుకుంది. తనకన్నా వయసులో నిక్ జోనస్ పదేళ్లు చిన్న వాడైనా ప్రేమలో అలాంటి తేడాలుండవంటూ ఒక్కటైపోయారు.

హరీష్ రావు కనిపించడం లేదు, అడిగితే ఆయనే చెప్తారు: లక్ష్మణ్

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయలేదనే విమర్శలపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ స్పందించారు. పదవుల కోసం రాజీ పడిన చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుదని ఆయన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 
 

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం: మోడీని పిలువని కేసీఆర్, భయం అదేనా..

తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పలువురు అతిథులను ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను ఆయన ఆహ్వానించారు.

 

విరహానికి చెక్... టీం ఇండియాక్రికెటర్ల చెంతకు భార్యలు

టీం ఇండియా క్రికెటర్ల విరహానికి పులిస్టాప్ పడింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా క్రికెటర్ల చెంతకు వారి భార్యలు చేరుకున్నారు. దీంతో... ఇప్పుడు వారు ప్రాక్టీస్ కాస్త రెస్ట్ ఇచ్చి... ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

కేసీఆర్ మైండ్ సెట్ మార్చుకోవడం వెనుక సీక్రెట్: విజయశాంతి ఆసక్తికరం

చివాలయం విషయంలో  కేసీఆర్ మైండ్ సెట్ మారడం వెనుక రహస్యం ఉందని టీఆర్ఎస్ నేతలు తనకు చెప్పారని కాంగ్రెస్ నేత, సినీ నటి విజయశాంతి చెప్పారు. ఈ విషయం విని తాను ఆశ్చర్యపోయినట్టుగా ఆమె అభిప్రాయపడ్డారు.ఈ విషయమై  విజయశాంతి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.
 

అల్లరి నరేష్ హీరోయిన్ తో ఎఫైర్.. కమెడియన్ సమాధానం ఇదే!

యం, 7జి బృందావన కాలనీ లాంటి చిత్రాల్లో నటించిన కమెడియన్ సుమన్ శెట్టిని అంత తొందరగా మరిచిపోలేం. హీరోతో కలసి అల్లరి వేషాలు వేస్తూ సుమన్ శెట్టి కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం సుమన్ శెట్టికి అవకాశాలు బాగా తగ్గాయి. సుమన్ శెట్టి ఇటీవల అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న అలీతో సరదా కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. 
 

జగన్.. బాలయ్య అభిమానా..? వైరల్ అవుతోన్న ఫోటో!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. 2000 సంవత్సరానికి చెందిన పేపర్ కటింగ్ అది. దీనిలో నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా యాడ్ ఒకటి ఉంది. అయితే ఈ ప్రకటన ఇచ్చింది ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తెలుస్తోంది.

 

సినిమాల్లో న్యూడ్ గా నటించి షాకిచ్చిన స్టార్స్

పాత్ర నచ్చితే కొంత మంది వంటి మీద నూలు పోగు కూడా లేకుండా నటించడానికి సిద్ధమవుతారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఎప్పుడు కనిపించని విధంగా నగ్న పాత్రలో నటించి షాకిచ్చిన స్టార్స్ వీరే.. 

'మల్లేశం' రివ్యూ..!

బయోపిక్ లు అంటే క్రీడాకారులు,రాజకీయనాయకులు వంటి ప్రజల్లో పేరున్న సెలబ్రెటీల గురించే తీయాలా..మన కష్టాలు తీరటానికి శ్రమించిన మనలో ఒకడు గురించి మాట్లాడకూడదా..వాటిని జనం చూడరా...ఆదరించరా అనే ఆలోచన కోట్లు ఖర్చు పెట్టే సినీ పరిశ్రమలో చాలా తక్కువ.
 

అతడిని కొట్టి.. షర్ట్ కాలర్ పట్టుకున్నా.. మెహ్రీన్ కామెంట్స్

పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఇటీవల ఆమె నటించిన 'ఎఫ్ 2' సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ధనుష్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.
 

అమలాపాల్ న్యూడ్ టీజర్ పై సమంత కామెంట్!

తమిళ  స్టార్ హీరోయిన్ అమలాపాల్  ఒక్కసారిగా న్యూడ్ గా టీజర్ లో కనిపించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు,తమిళ, మళయాళ ఇండస్ట్రీలు ఆ సినిమా గురించే మాట్లాడుకునేలే చేసింది.
 

లిప్ లాక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీరియల్ నటి!

సీరియల్స్ ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముద్దుగుమ్మ ప్రియా భవాని శంకర్. చినబాబు సినిమాలో కార్తీ సరసన నటించి ఇప్పుడు మంచి ఆఫర్స్ ను అందుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన ఎస్ జె. సూర్య మాన్ స్టర్ సినిమాలో కూడా ప్రియా భవాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. 
 

రషీద్ ఖాన్ ను రప్పాడించిన ఇంగ్లాండ్...ప్రపంచ కప్ చరిత్రలోనే చెత్త రికార్డు

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు మరోసారి సత్తా చాటింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆ జట్టు ఈసారి భారీ విజయాన్ని అందుకుంది. మాంచెస్టర్ వేదికగా అప్ఘానిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ముందు అప్ఘాన్ బౌలర్లు నిలవలేకపోయారు. మరీ ముఖ్యంగా ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ వీరబాదుడుకు బౌలర్లంతా చేతులెత్తేయాల్సి వచ్చింది. 
 

ఆ మ్యాచ్ గురించి మర్చిపో... సర్ఫరాజ్ కి పీసీబీ సూచన

పీసీబీ.. కెప్టెన్ సర్ఫరాజ్ లో ధైర్యం పెంచే ప్రయత్నం చేశారు. ‘దేశమంతా మీకు అండగా ఉంది. రాబోయే రోజుల్లో కలసికట్టుగా మెరుగైన ప్రదర్శనను ఇస్తారని ఆశిస్తున్నాం’ అని సర్ఫరాజ్‌ అహ్మద్‌తో ఎహ్‌సాన్‌ మణి ఫోన్‌లో మాట్లాడినట్లు పాక్ మీడియా తెలిపింది.

 

అమలాపాల్ న్యూడ్ వీడియోపై వర్మ కామెంట్స్!

కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోలు, బోల్డ్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆమె నటించిన  తమిళ చిత్రం 'ఆడై' టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూసిన వారు షాక్ అయ్యారు. దీనికి కారణం అమలాపాల్ ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా టీజర్ లో కనిపించింది.

 

కోహ్లీని హగ్ చేసుకున్న సినీ నటి... అనుష్క హర్ట్..?

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సినీ నటి ఊర్వశీ రౌతేలా హగ్ చేసుకున్న ఫోటో ఇప్పుడు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాక్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. జట్టును విజయపథంలో దూసుకువెళ్లేలా చేసిన కోహ్లీపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన అభిమానాన్ని చాటుకున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios