- Home
- Business
- Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Top 5 Stocks: ఇన్వెస్టర్లకు పండగే పండగ.. క్రాష్ మార్కెట్‌లోనూ కోట్లు కురిపించిన టాప్ 5 స్టాక్స్ ఇవే
Top 5 Stocks: స్టాక్ మార్కెట్ తీవ్రమైన హెచ్చుతగ్గులు, నష్టాల్లో ఉన్నప్పటికీ, కొన్ని స్మాల్ క్యాప్, పెన్నీ షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. ఒక్క వారంలోనే 91 శాతానికి పైగా రిటర్న్స్ అందించి, ఇన్వెస్టర్ల పెట్టుబడిని రెట్టింపు చేశాయి.

స్టాక్ మార్కెట్ పడిపోయినా ఈ 5 షేర్లు పెరిగాయి.. వారంలోనే డబుల్ రిటర్న్స్
గత వారం ఇండియన్ స్టాక్ మార్కెట్‌కు అసలు బాలేదు. సూచీలు భారీగా పడిపోయాయి. ఇన్వెస్టర్లు నష్టాల్లో కూరుకుపోయారు. అయినా సరే కొన్ని కంపెనీల షేర్లు మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్లాయి. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ ఐదు షేర్లు మాత్రం తమ ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చాయి. ఏకంగా 91 శాతానికి పైగా రిటర్న్స్ ఇచ్చి దాదాపు డబ్బును డబుల్ చేశాయి.
మార్కెట్ ఎందుకు పడిపోయింది?
గత వారం బీఎస్‌ఇ సెన్సెక్స్ 1,733.67 పాయింట్లు అంటే 2.26 శాతం పడిపోయి 74,781.76 దగ్గర ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 50 కూడా 499.6 పాయింట్లు అంటే 2.09 శాతం నష్టపోయి 23,398.10 వద్ద క్లోజ్ అయింది. సూచీలు ఈ స్థాయిలో పడిపోవడంతో ఇన్వెస్టర్లు కలవరపడ్డారు. కానీ ఈ క్రాష్ మార్కెట్‌లోనూ 5 షేర్లు మాత్రం విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టాయి.
ఈఎస్‌డిఎస్ సాఫ్ట్‌వేర్ రాకెట్ దూకుడు
ఇటీవలే మార్కెట్‌లో లిస్ట్ అయిన ఈఎస్‌డిఎస్ సాఫ్ట్‌వేర్ షేరు గత వారంలో టాప్‌లో నిలిచింది. ఈ షేరు ఏకంగా 91.65 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అంటే ఇన్వెస్టర్ల డబ్బు దాదాపు రెట్టింపు అయింది. వారం వ్యవధిలో ఈ షేరు ధర రూ.895.55 నుండి రూ.1716.35 కి పెరిగింది. శుక్రవారం బీఎస్‌ఇలో ఈ షేరు 10 శాతం జంప్ అయి రూ.1,716.35 వద్ద ముగిసింది. ఈ ధరకు కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.20,117.50 కోట్లకు చేరింది.
అన్మోల్ ఇండియా, మార్బుల్ సిటీ హవా
అన్మోల్ ఇండియా షేరు గత వారం 69.22 శాతం పెరిగింది. కంపెనీ షేరు ధర రూ.10.04 నుండి రూ.16.99 కి చేరింది. శుక్రవారం బీఎస్‌ఇలో ఈ షేరు 10 శాతం పెరిగి రూ.16.99 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.96.01 కోట్లుగా ఉంది. మరోవైపు మార్బుల్ సిటీ ఇండియా షేరు గత వారం 68.10 శాతం లాభపడింది. ఈ షేరు రూ.102.50 నుండి రూ.172.30 కి పెరిగింది. శుక్రవారం నాడే ఇది 19.28 శాతం పెరిగి రూ.172.30 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.448.50 కోట్లుగా ఉంది.
లాడర్‌అప్ ఫైనాన్స్, సన్ రీటైల్ జోరు
లాడర్‌అప్ ఫైనాన్స్ స్టాక్ గత వారం 63.24 శాతం పైకి లేచింది. వారంలో ఈ షేరు రూ.47.50 నుండి రూ.77.54 కి పెరిగింది. శుక్రవారం బీఎస్‌ఇలో 18.13 శాతం లాభంతో రూ.77.54 వద్ద క్లోజ్ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.70 కోట్లుగా నమోదైంది. చివరిగా సన్ రీటైల్ స్టాక్ గత వారం 58.06 శాతం పెరిగింది. ఈ షేరు రూ.0.31 నుండి రూ.0.49 కి చేరింది. శుక్రవారం 8.89 శాతం పెరిగి రూ.0.49 వద్ద ముగిసింది. దీని మార్కెట్ క్యాప్ రూ.7.60 కోట్లుగా ఉంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు తీవ్రమైన మార్కెట్ రిస్క్ తో కూడుకున్నవి. మార్కెట్‌లో లాభనష్టాలు ఎప్పుడైనా మారవచ్చు. కాబట్టి ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టేముందు మీ ఆర్థిక సలహాదారుని (SEBI Registered Advisor) సంప్రదించి, సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

