సీరియల్స్ ద్వారా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముద్దుగుమ్మ ప్రియా భవాని శంకర్. చినబాబు సినిమాలో కార్తీ సరసన నటించి ఇప్పుడు మంచి ఆఫర్స్ ను అందుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన ఎస్ జె. సూర్య మాన్ స్టర్ సినిమాలో కూడా ప్రియా భవాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. 

దీంతో స్టార్ హీరోల సరసన ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం మూడు సినిమాలతో ఈ బేబీ బిజీగా ఉంది. అసలు విషయంలోకి వస్తే ముద్దు సీన్లలో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. బికినీ సీన్ లో నటించడానికి మాత్రం అస్సలు ఒప్పుకోనని చెప్పేసింది.

అయితే లిప్ లాక్ కూడా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తేనే ఒకే చెబుతానని ఒక షరతు విధించింది. కోలీవుడ్ లో ప్రియా అందానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అజిత్ - విజయ్ లాంటి స్టార్ హీరోల సరసన నటిస్తే బావుంటుందని ఫ్యాన్స్ నుంచి ఆమెకు విన్నపాలు అందుతున్నాయి.