MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?

BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?

BRICS 2026: ప్రపంచ రాజకీయాలోనూ, ఆర్థిక వ్యవస్థలోనూ గ్లోబల్ సౌత్ గొంతుకగా భారత్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. 18వ బ్రిక్స్ సదస్సు 2026 ద్వారా గ్లోబల్ సౌత్ నాయకుడిగా భారత్ మళ్లీ తన బలాన్ని నిరూపించుకుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 14 2026, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
BRICS Summit 2026: భారత్ దౌత్య సంచలనం.. గ్లోబల్ గేమ్‌లో చక్రం తిప్పిన ఇండియా
Image Credit : Chatgpt

BRICS Summit 2026: భారత్ దౌత్య సంచలనం.. గ్లోబల్ గేమ్‌లో చక్రం తిప్పిన ఇండియా

న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12-13 తేదీల్లో జరిగిన 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ప్రపంచ రాజకీయాలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. భారత్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు కేవలం చర్చలకే పరిమితం కాకుండా, గ్లోబల్ లెవల్లో ఇండియా పవర్ ఏంటో చూపించింది. విభిన్న అభిప్రాయాలు ఉన్న వివిధ పెద్ద దేశాలను ఒకే తాటిపైకి తెచ్చి, 'న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026' ఆమోదింపజేయడం భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ సదస్సులో మన దేశం సాధించిన టాప్ 5 విజయాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. ఉగ్రవాదంపై గర్జించిన భారత్.. పహల్గామ్ దాడి తీవ్ర ఖండన
Image Credit : ANI

1. ఉగ్రవాదంపై గర్జించిన భారత్.. పహల్గామ్ దాడి తీవ్ర ఖండన

ఈ సదస్సులో భారత్ సాధించిన అత్యంత ప్రధాన దౌత్య విజయం ఉగ్రవాదంపై మిగిలిన దేశాలను ఏకం చేయడం. సరిహద్దు దాటి వచ్చి పన్నిన ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సురక్షిత ప్రాంతాలు కల్పించడం, ఉగ్ర సంస్థలకు అందే నిధుల సరఫరాను బ్రిక్స్ దేశాలన్నీ ఏకగ్రీవంగా ఖండించాయి. విశేషమేమిటంటే, 2025 ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన పిరికిపంద ఉగ్రదాడిని పేరుతో సహా ప్రస్తావిస్తూ తీవ్రంగా ఖండించేలా చైనా, రష్యా సహా అన్ని దేశాలను భారత్ ఒప్పించగలిగింది.

36
2. లోకల్ కరెన్సీ డ్రైవ్.. డాలర్ ఆధిపత్యానికి బ్రేకులు
Image Credit : ANI

2. లోకల్ కరెన్సీ డ్రైవ్.. డాలర్ ఆధిపత్యానికి బ్రేకులు

గ్లోబల్ మార్కెట్‌లో అంతర్జాతీయ వ్యాపారం కోసం అమెరికన్ డాలర్‌పై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభ్య దేశాల మధ్య వాణిజ్యానికి రూపాయి, యువాన్, రూబుల్ వంటి స్థానిక కరెన్సీల వినియోగాన్ని పెంచడానికి బ్రిక్స్ అంగీకరించింది. దీని కోసం భారత్ ప్రతిపాదించిన 'BRICS Payment Task Force' ద్వారా జాతీయ చెల్లింపుల వ్యవస్థలను అనుసంధానించనున్నారు. అలాగే, క్రాస్-బోర్డర్ చెల్లింపులను సులభతరం చేసే చర్యలకు ప్రతిపాదనలు ఖరారయ్యాయి.

46
3. వరల్డ్ క్లాస్ డిజిటల్ పవర్.. మన యూపీఐ, డీపీఐ కి గ్లోబల్ ప్రశంసలు
Image Credit : ANI

3. వరల్డ్ క్లాస్ డిజిటల్ పవర్.. మన యూపీఐ, డీపీఐ కి గ్లోబల్ ప్రశంసలు

చిన్న చిల్లర అంగడి నుంచి పెద్ద షోరూమ్ దాకా వాడే యూపీఐ (UPI), ఆధార్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI) విజయాన్ని ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. ఈ భారతీయ డిజిటల్ మోడల్‌ను బ్రిక్స్ దేశాల డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సభ్య దేశాల మధ్య ఈ టెక్నాలజీని పంచుకోవడానికి ప్రత్యేకంగా "BRICS Repository for Digital Public Infrastructure" ను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపారు. దీంతో టెక్నాలజీ రంగంలో భారత్ ఒక గ్లోబల్ లీడర్‌గా ఆవిర్భవించింది.

56
4. హెల్త్ అండ్ మెంటల్ వెల్‌నెస్‌లో 'నిమ్‌హాన్స్' గ్లోబల్ లీడర్
Image Credit : Asianet News

4. హెల్త్ అండ్ మెంటల్ వెల్‌నెస్‌లో 'నిమ్‌హాన్స్' గ్లోబల్ లీడర్

ఆరోగ్య రంగంలోనూ మన దేశానిదే పైచేయిగా నిలిచింది. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం పై ప్రపంచస్థాయిలో శ్రద్ధ పెట్టేందుకు భారతదేశం వేసిన ప్లాన్‌కు మిగిలిన దేశాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. బెంగళూరులోని ప్రసిద్ధ 'నిమ్‌హాన్స్' (NIMHANS) సంస్థ ఈ బ్రిక్స్ 'సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్' కు మెయిన్ కోఆర్డినేటింగ్ సెంటర్‌గా వ్యవహరిస్తుందని ప్రకటన వెలువడింది. దీనితో పాటు బ్రిక్స్ హెల్తీ లైఫ్‌స్టైల్ మిషన్, అంటువ్యాధుల సమాచారం ముందే తెలుసుకునే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ వంటివి కూడా భారత్ నేతృత్వంలో అందుబాటులోకి రానున్నాయి.

66
5. MSMEలు, ఏఐ, అగ్రికల్చర్‌ డిజిటల్ నెట్‌వర్క్‌లకు సూపర్ బూస్ట్
Image Credit : ANI

5. MSMEలు, ఏఐ, అగ్రికల్చర్‌ డిజిటల్ నెట్‌వర్క్‌లకు సూపర్ బూస్ట్

చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSMEs) అభివృద్ధే లక్ష్యంగా "India Centre for BRICS Industrial Competencies" ఏర్పాటుకు ఆమోదముద్ర పడింది. అలాగే 'జైపూర్ కాన్సెన్సస్' ద్వారా చిన్న వ్యాపారాలకు ఆర్థిక సహాయం, గ్లోబల్ మార్కెట్లలో అవకాశాలు కల్పించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), అగ్రికల్చర్‌లో డిజిటల్ నెట్‌వర్క్‌ల వాడకం వంటి అంశాల్లో భారత్ కీలక భాగస్వామిగా మారింది. మొత్తానికి ఈ బ్రిక్స్ సమ్మిట్ 2026 ద్వారా గ్లోబల్ సౌత్ లో భారత్ తన పవర్ ఏంటో చూపడమే కాకుండా, వ్యాపార, సాంకేతిక, ఆరోగ్య రంగాల్లో నయా రికార్డులను సృష్టించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image2
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Recommended image3
BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
Related Stories
Recommended image1
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ బిగ్ అలర్ట్
Recommended image2
Stock Market Outlook: ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved