కోలీవుడ్ హీరోయిన్ అమలాపాల్ ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోలు, బోల్డ్ కామెంట్స్ తో తరచూ వార్తల్లో ఉంటోంది. తాజాగా ఆమె నటించిన  తమిళ చిత్రం 'ఆడై' టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూసిన వారు షాక్ అయ్యారు. దీనికి కారణం అమలాపాల్ ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా టీజర్ లో కనిపించింది.

ఇప్పుడు ఈ టీజర్ సెన్సేషన్ గా మారింది. తెలుగులో 'ఆమె' పేరుతో టీజర్ ని విడుదల చేశారు. ఇది చూసిన దర్శకుడు వర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె నగ్నత్వంలో నిజాయితీ తన హృదయానికి హత్తుకుందంటూ ట్వీట్ చేశారు.

ఈ టీజర్ ని తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. న్యూడ్ గా నటించిన అమాలపాల్ పై దర్శకనిర్మాతలపై ప్రశంసలు కురిపించాడు. ఇక టీజర్ విషయానికొస్తే.. తన కూతురు కనిపించడం లేదని ఒక తల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తుంది.

తన కూతురు చివరగా తనతో మాట్లాడినప్పుడు తాగి ఉందని చెప్పడంతో మిస్ అయిన అమ్మాయిని పోలీసులు వెతకడం, చివరగా ఆమె ఓ బిల్డింగ్ లో నగ్నంగా కనిపించడంతో  టీజర్ ని ఎండ్ చేశారు. టీజర్ ని బట్టి ఈ సినిమా థ్రిల్లర్ నేపధ్యంలో సాగుతుందనిపిస్తుంది.