ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. 2000 సంవత్సరానికి చెందిన పేపర్ కటింగ్ అది. దీనిలో నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా యాడ్ ఒకటి ఉంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది. 2000 సంవత్సరానికి చెందిన పేపర్ కటింగ్ అది. దీనిలో నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా యాడ్ ఒకటి ఉంది. అయితే ఈ ప్రకటన ఇచ్చింది ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తెలుస్తోంది.

'2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం' అని ఆ ప్రకటనలో ఉంది. అప్పటి జగన్ ఫోటో కూడా ఈ యాడ్ లో కనిపిస్తోంది. గతంలో జగన్.. బాలయ్య అభిమాని అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ ప్రకటన చూసిన వారు అవన్నీ నిజమే అనుకున్నారు.

కానీ జగన్ అభిమానులు మాత్రం ఈ ఫోటో ఫేక్ అని తేల్చేశారు. ఈ ఫోటోని మార్ఫింగ్ చేశారని, అసలు జగన్.. బాలయ్య అభిమాని కాదని అంటున్నారు. 'సమరసింహారెడ్డి' సినిమా 1999లో విడుదలైంది. కడపలో ఈ సినిమా ఒకే థియేటర్లో 365 రోజులు ఆడింది. ఈ సందర్భంగా 2000 సంవత్సరంలో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం ఒక యాడ్ ఇచ్చింది. ఇక్కడ వరకూ ఓకే కానీ, అభిమాన సంఘం అధ్యక్షుడు మాత్రం జగన్ కాదట.

దానికి ప్రూఫ్ లు కూడా చూపిస్తున్నారు. ఈ పేపర్ యాడ్ లో ఉన్న జగన్ ఫోటో 2003లో తీసిందట. తన భార్య భారతితో ఈ ఫోటో తీసుకున్నరు. ఆ కలర్ ఫోటోలో జగన్ ఇమేజ్ ని తీసుకొని బ్లాక్ అండ్ వైట్ గా మార్చి ఈ పేపర్ లో యాడ్ చేశారని అంటున్నారు. అంతేకానీ.. జగన్.. బాలయ్యకి అభిమాని కాదని, ఆ యాడ్ కూడా ఆయన ఇవ్వలేదని చెబుతున్నారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…