- Home
- Astrology
- Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది!
Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 15.09.2026 మంగళవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి రాశి ఫలాలు
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశి ఫలాలు
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. విందు, వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతానం పొటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
వృషభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానిస్తాయి.
మిథున రాశి ఫలాలు
విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి కొత్త విషయాలను తెలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు.
కర్కాటక రాశి ఫలాలు
ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఇంట్లో సంతాన శుభకార్యాలకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ యత్నాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి.
సింహ రాశి ఫలాలు
వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు సహాయం అందుతుంది.
కన్య రాశి ఫలాలు
ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాలలో కొంత జాగ్రత్త అవసరం.
తుల రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతన వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలల్లో విజయం సాధిస్తారు. దీర్ణకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.
వృశ్చిక రాశి ఫలాలు
వ్యాపార విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. దైవ చింతన పెరుగుతుంది. భూ క్రయ విక్రయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
ధనుస్సు రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో విశేషమైన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
మకర రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో మాట పట్టింపులు తొలగుతాయి.
కుంభ రాశి ఫలాలు
వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
మీన రాశి ఫలాలు
భూ క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కారించుకుంటారు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది.

