Asianet News TeluguAsianet News Telugu

అతడిని కొట్టి.. షర్ట్ కాలర్ పట్టుకున్నా.. మెహ్రీన్ కామెంట్స్!

పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. 

mehreen interesting comments
Author
Hyderabad, First Published Jun 19, 2019, 9:39 AM IST

పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. ఇటీవల ఆమె నటించిన 'ఎఫ్ 2' సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ధనుష్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది.

చిన్నప్పటి నుండి హీరోయిన్ కావాలనేదే తన డ్రీమ్ అని చెబుతోంది మెహ్రీన్. చిన్నప్పుడు స్కూల్ లో టీచర్ ఒక్కొక్కరినీ వారి గోల్స్ ఏంటో చెప్పమంటే.. అందరూ డాక్టర్, లాయర్, పైలెట్ అని చెబుతుంటే తను మాత్రం హీరోయిన్ అవుతానని చెప్పేదట. 13 ఏళ్లకే కెనడాలో 'మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా' టైటిల్ ని సాధించింది. 

స్కూల్ లో, కాలేజ్ డేస్ లో టామ్ బాయ్ గా ఉండేదాన్ని అని, అందువల్ల అబ్బాయిలు మాట్లాడాలంటే భయపడేవారని చెప్పింది. అయితే ఆమె పదవ తరగతి చుఅడువుతోన్న సమయంలో ఓ వ్యక్తిని కొట్టి అతడి షర్ట్ కాలర్ పట్టుకున్న విషయాన్ని గుర్తు చేసుకొంది. తన స్నేహితులతో కలిసి మాల్ కి వెళ్లినప్పుడు, ఓ అబ్బాయి మెహ్రీన్ కి తెలియకుండా.. ఆమె పర్మిషన్ లేకుండా ఫోటోలు తీశాడట.

ఆమె వెంటనే సెక్యురిటీ వాళ్లకు సమాచారం ఇచ్చి, ఫోటోలు తీసిన వ్యక్తి దగ్గరకి వెళ్లి మొబైల్ చూపించమని అడిగితే దానికి అతడు అంగీకరించకపోవడంతో ఒక్క లెంపకాయ కొట్టి అతడి షర్ట్ కాలర్ పట్టుకుందట. వెంటనే ఫోన్ తీసుకొని ఫొటోలన్నీ డిలీట్ చేసిందట. ఇక ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. తనకు ఇంతవరకు కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురుకాలేదని, ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలు  అందరూ చాలా బాగా ఆదరిస్తున్నారని చెప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios