Asianet News TeluguAsianet News Telugu

హరీష్ రావు కనిపించడం లేదు, అడిగితే ఆయనే చెప్తారు: లక్ష్మణ్

కాళేశ్వరం ప్రాజక్టు కోసం కేంద్రం ఏమి చేసిందో కేంద్రమంత్రుల చుట్టూ తిరిగిన హరీష్‌రావును అడిగి తెలుసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. ప్రసుతం హరీష్‌రావు ఎక్కడ కన్పించటం‌ లేదని ఆయన అన్నారు.

Laxman says not able to find Harish rao
Author
Hyderabad, First Published Jun 19, 2019, 1:34 PM IST

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేయలేదనే విమర్శలపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ స్పందించారు. పదవుల కోసం రాజీ పడిన చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుదని ఆయన అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

కాళేశ్వరం ప్రాజక్టు కోసం కేంద్రం ఏమి చేసిందో కేంద్రమంత్రుల చుట్టూ తిరిగిన హరీష్‌రావును అడిగి తెలుసుకోవాలని లక్ష్మణ్ సూచించారు. ప్రసుతం హరీష్‌రావు ఎక్కడ కన్పించటం‌ లేదని ఆయన అన్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ రామగుండం ఎరువుల కర్మాగారం కోసం కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఎ

మ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభోత్సవానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పిలవకపోవటం దురదృష్టకరమని లక్ష్మణ్ ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల తర్వాత క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల హామీలపై చర్చించకపోవటం అన్యాయమని ఆయన అన్నారు. 

రాష్ట్రంలోని 30 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల కోసమే క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారని ఆయన తప్పు పట్టారు. బీజేపీ కార్యాలయాల కోసం స్థలం కోరితే మాత్రం కేసీఆర్ స్పందించటం లేదని విమర్శించారు. 

ప్రస్తుతం కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాలు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న శాససభను మార్చటానికి తాము వ్యతిరేకమని లక్ష్మణ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios