ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్. బాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న పీసీ హాలీవుడ్ లో కూడా నటిస్తోంది. అమెరికన్ కుర్రాడు, ప్రముఖ హాలీవుడ్ సింగర్ అయిన నిక్ జోనస్ ని బుట్టలో పడేసి పెళ్లి కూడా చేసేసుకుంది. తనకన్నా వయసులో నిక్ జోనస్ పదేళ్లు చిన్న వాడైనా ప్రేమలో అలాంటి తేడాలుండవంటూ ఒక్కటైపోయారు. 

ప్రస్తుతం ప్రియాంక చోప్రా అంటే స్టైల్ కు ఐకాన్. ప్రియాంక ధరించే అవుట్ ఫిట్స్ అలా ఉంటాయి మరి. తాజాగా ప్రియాంక ధరించిన ఓ డ్రెస్ సామజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఖాఖీ నిక్కరు, వైట్ టాప్ ధరించి స్టైలిష్ లుక్ లో అదరగొడుతోంది. పీసీ డ్రెస్ బావున్నా ఆమెపై జోకులు పేలుతున్నాయి. ప్రియాంక ధరించిన డ్రెస్ బిజెపి అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ ని పోలిఉండడమే అందుకు కారణం. 

ప్రియాంక చోప్రా ఆర్ఎస్ఎస్ లో చేరింది. ఆమె ఆర్ఎస్ఎస్ క్యాంప్ నుంచే ప్రస్తుతం బయటకు వస్తోంది అంటూ నెటిజన్లు ఎవరికి తోచినవిధంగా వారు కామన్స్ పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఓ కార్యక్రమంలో ఎక్స్ ఫోజింగ్ దారుణంగా ఉండే డ్రెస్ ధరించిన పీసీ విమర్శలపాలైంది. గత ఏడాది ప్రధాని నరేంద్రమోడీని కలసిన సందర్భంలో కూడా పొట్టి దుస్తులతో విమర్శలు ఎదుర్కొంది. ఇలా ప్రియాంక తాను ధరిస్తున్న డ్రెస్ లతోనే హాట్ టాపిక్ గా మారుతోంది.