అమరావతి: వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మకు ఏపీ  మహిళ కమిషన్ చైర్ పర్సన్ పదవిని కట్టబెట్టనున్నారు. త్వరలోనే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. పార్టీ కోసం మొదటి నుండి  కష్టపడిన వారి కోసం ఏపీ సీఎం జగన్  పదవులు కట్టబెడుతున్నారు.

మంత్రివర్గంలో  కూడ పార్టీ కోసం కష్టపడిన వారికే  పెద్దపీట వేశారు. వైసీపీ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న  వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళ కమిషన్ చైర్‌పర్సన్ పదవిని కట్టబెట్టనున్నారు.

ప్రస్తుతం ఈ పదవిలో నన్నపనేని రాజకుమారి ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నన్నపనేని రాజకుమారికి  ఈ పదవిని చంద్రబాబు కట్టబెట్టారు. ఏపీ సీఎం జగన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నన్నపనేని రాజకుమారి జగన్‌ను కలిసింది.

వాసిరెడ్డి పద్మకు మహిళ కమిషన్ చైర్మెన్ పదవి కట్టబెట్టాలని జగన్ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.