టీం ఇండియా క్రికెటర్ల విరహానికి పులిస్టాప్ పడింది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా క్రికెటర్ల చెంతకు వారి భార్యలు చేరుకున్నారు. దీంతో... ఇప్పుడు వారు ప్రాక్టీస్ కాస్త రెస్ట్ ఇచ్చి... ఫ్యామిలీతో సమయం గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు  క్రికెటర్ల వెంట భార్య, గర్ల్ ఫ్రెండ్స్ వెళ్లడానికి బీసీసీఐ ఆంక్షలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నెలన్నర పాటు జరిగే వన్డే వరల్డ్‌క్‌పలో కేవ లం 15 రోజులే వారితో గడిపే అవకాశం ఉంది. అది కూడా పర్యటన ప్రారంభమైన మొదటి 20 రోజుల వరకు కుటుంబ సభ్యు లు ఇంగ్లండ్‌ వెళ్లే అవకాశం లేకుండా కొత్త నిబంధన తీసుకువచ్చింది.

ఆ నిబంధన ప్రకారం... ఇప్పుడు కుటుంబసభ్యులతో గడిపేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది. దీంతో... క్రికెటర్ల భార్యలు లండన్ చేరుకున్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. భార్య అనుష్క శర్మతో లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. లాగే మిగతా ఆటగాళ్లు వారి కుటుంబసభ్యులతో గడుపుతున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ, అనుష్కల జంట లండన్‌లోని ఓల్డ్‌ బాండ్‌ స్ట్రీట్‌లో కనిపించడంతో అభిమానులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.