తమిళ  స్టార్ హీరోయిన్ అమలాపాల్  ఒక్కసారిగా న్యూడ్ గా టీజర్ లో కనిపించి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తెలుగు,తమిళ, మళయాళ ఇండస్ట్రీలు ఆ సినిమా గురించే మాట్లాడుకునేలే చేసింది. ఆమె నగ్నంగా కనపడటం అనేది ఎవరు కూడా ఊహించకపోవటం,... తోటి స్టార్ హీరోయిన్స్ ఎవరూ ఆ ధైర్యం చేయకపోవటం ప్లస్ అయ్యింది. దాంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. 

అయితే ఈ న్యూడ్ యాక్ట్ కు కొందరు నెగిటివ్ గా స్పందించారు. పబ్లిసిటీ కోసం ఇంతలా దిగజారాలా అన్నట్లు ఆ టీజర్ క్రింద కామెంట్స్ పెట్టారు, సోషల్ మీడియాలో రచ్చ చేసారు. అయితే  అదే సమయంలో ఈ టీజర్ కు సినీ ప్రముఖుల నుండి అలాగే, అభిమానుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.

అలాగే అక్కినేని సమంత ఈ టీజర్ పై రెస్పాండ్ అయ్యింది. “ఆడై” టీజర్ ప్రేక్షకులకు అత్యంత ఉత్కంఠ కలింగించేలా, అద్భుతంగా ఉంది, బెస్ట్ విషెస్ టు అమలాపాల్, సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అంటూ ట్వీట్ చేసింది. 

తమిళ దర్శకుడు  రత్నకుమార్ దర్శకత్వం వహించిన ‘ఆడై’ టీజర్‌లో ఆరంభంలో కూతురు కనిపించడంలేదని ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం.. పోలీసులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లడం, ఒక సస్పెన్స్ వాతావరణంలో నెలకొంటుంది. అఖర్లో అమలాపాల్ ఒంటిమీద ఒక్క నూలుపోగు లేకుండా పూర్తి నగ్నంగా కనిపిస్తుంది. 

అమలాపాల్ న్యూడ్ వీడియోపై వర్మ కామెంట్స్!