MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Epic Movie Review: ఎపిక్‌ మూవీ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?

Epic Movie Review: ఎపిక్‌ మూవీ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మూవీ `ఎపిక్‌ ఫస్ట్ సెమిస్టర్‌`. `బేబీ` తర్వాత ఈ ఇద్దరు జంటగా నటించిన ఈ మూవీ తాజాగా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందంటే?

5 Min read
Author : Aithagoni Raju
Published : Sep 11 2026, 06:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఎపిక్‌ మూవీ రివ్యూ
Image Credit : X

ఎపిక్‌ మూవీ రివ్యూ

`బేబీ` తర్వాత ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన చిత్రం `ఎపిక్‌`(ఫస్ట్ సెమిస్టర్‌). ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకర మూవీస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇది `90 మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌` వెబ్‌ సిరీస్‌కి కొనసాగింపుగా, అందులోని చిన్న కుర్రాడి జర్నీని తీసుకొని రూపొందించారు. ఇది నేడు శుక్రవారం(సెప్టెంబర్‌ 11)న విడుదలైంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ప్రారంభం నుంచి మూవీపై మంచి బజ్‌ ఉంది. దీనికితోడు `బేబీ` జోడీ మళ్లీ కలిసి చేసిన మూవీ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి మరోసారి ఈ జంట మ్యాజిక్‌ చేసింది, అంచనాలను అందుకునేలా సినిమా ఉందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఎపిక్‌ మూవీ కథ ఏంటంటే?
Image Credit : X/@SitharaEnts

ఎపిక్‌ మూవీ కథ ఏంటంటే?

వనపర్తికి చెందిన ఒక సాధారణ మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు ఆదిత్య(ఆనంద్‌ దేవరకొండ). సినిమా డైరెక్టర్‌ కావాలనే కలలు కంటుంటాడు. వాళ్ల నాన్న చంద్రశేఖర్‌(శివాజీ) టీచర్‌. అమ్మ(వాసుకి) హౌజ్‌ వైఫ్‌. డిగ్రీ చేసి మూడేళ్లు అయినా ఖాళీగా తిరుగుతున్న ఆదిత్యని యూకే పంపిస్తాడు వాళ్ల నాన్న. ఇష్టం లేకపోయినా పేరెంట్స్ కోసం యూకే వెళ్తాడు ఆదిత్య. తనకు అక్కడ ఏం తెలియదు. అమ్మాయిలతో ఎలా ఉండాలో కూడా తెలియదు. మొదటి రోజు అక్కడ మన తెలుగువాడు(గవిరెడ్డి) పరిచయం అవుతాడు. సపోర్ట్ చేస్తాడు. తన రూమ్‌ కూడా ఇస్తాడు. కాలేజీకి వెళ్లగా అక్కడ కడలి(వైష్ణవి చైతన్య) పరిచయం అవుతుంది. ఆదిత్యని అన్ని రకాలుగా గైడ్‌ చేస్తుంది. ఒక రోజు మొత్తం ఆమె తనతోనే ఉంటుంది. దీంతో ఆమెకి ఇంప్రెస్‌ అవుతాడు ఆదిత్య. అంతేకాదు రాత్రి తన రూమ్‌కి ఇన్‌వైట్‌ చేయగా, ఆమె కూడా వస్తుంది. ఆ రాత్రి ఇద్దరు మాంచి రొమాంటిక్‌ మూడ్‌లో కిస్‌ చేసుకుంటారు. ఆ తర్వాత పర్మినెంట్‌గా తన రూమ్‌లోనే ఉండిపోతుంది కడలి. ఇద్దరు ఫ్రెండ్స్ అయి, ఆ తర్వాత ఫిజికల్‌గానూ కలుస్తారు. నీ కాస్ట్ నా కాస్ట్ వేరని, ఈ లవ్‌, ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం, పెళ్లి లాంటివి వద్దు అని ముందుగానే చెబుతుంది కడలి. మొదట బయపడ్డ ఆదిత్య.. తర్వాత ఓకే చెబుతారు. ఒకేరూమ్‌లో ఉన్న వీరిద్దరు ఏంచేశారు? వీరి జర్నీ ఎలాంటి మలుపులు తీసుకుంది? నిజంగానే ఈ ఇద్దరు స్నేహితులుగా ఉన్నారా? ప్రేమికులుగా మారిపోయారా? ఎమోషనల్‌ కనెక్షన్‌కి దూరంగా ఉన్నారా? చదువుకోవడానికి వెళ్లిన ఆదిత్య అక్కడ ఏం చేశాడు. ఆయనలో వచ్చిన రియలైజేషన్‌ ఏంటి? ఇంతకి కడలిది ఎక్కడ? ఆమె ఒక్క రోజులోనే ఆదిత్య రూమ్‌లో ఉండేందుకు ఎందుకు ఓకే చెప్పింది? ఆమె కథేంటి? చివరగా ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడనేది మిగిలిన కథ.

Related Articles

Related image1
Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?
Related image2
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
37
ఎపిక్‌ మూవీ విశ్లేషణ
Image Credit : X/@SitharaEnts

ఎపిక్‌ మూవీ విశ్లేషణ

ఫారెన్‌ వెళ్లిన చాలా మంది స్టూడెంట్స్ జీవితాలను అద్దంపట్టే కథతో రూపొందించిన చిత్రమిది. ప్రారంభంలో సిన్సియర్‌గా చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కల్చర్‌కి ఎలా మారిపోయారు? అమ్మాయిలు, అబ్బాయిలు జల్సాలకు అలవాటై లైఫ్‌ని ఎలా డిస్టర్బ్ చేసుకుంటున్నారనేది ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. ఒక అబ్బాయి ప్రేమ, పెళ్లి కంటే ముందు లైఫ్‌లో సెటిల్‌ కావడమనేది మంచి సందేశాన్ని అందించిన చిత్రమిది. అమ్మాయి, ప్రేమ వంటి అంశాలు కూడా ముఖ్యమే, కానీ వాటి మాయలో పడి గోల్‌ ని మిస్‌ అయితే లైఫ్‌ తలక్రిందులవుతుందనే విషయాన్ని ఇందులో సున్నితంగా చెప్పాడు దర్శకుడు ఆదిత్య హాసన్‌. అదే సమయంలో ఇందులో అమ్మాయి, అబ్బాయి పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో వారి లైఫ్‌, సమాజాన్ని చూపించడం విశేషం. సినిమాగా చూసినప్పుడు హీరో పాత్ర తీరుతెన్నులను పరిచయం చేస్తూ సాగుతుంది. తను దర్శకుడు కావాలనుకుంటాడు, ఇంట్లో వద్దు అంటారు. ఫారెన్‌ పంపిస్తారు. అక్కడ ఇన్నోసెంట్‌గా వెళ్లిన హీరో అన్నింటిలోనూ ఆరితేరడం, అక్కడి వారికే షాక్‌ ఇవ్వడం వంటి సన్నివేశాలను చాలా సరదాగా, ఫన్నీగా, ట్రెండీగా చూపించారు. అదే సమయంలో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా లిప్‌ కిస్‌లు, రొమాన్స్ సీన్లు పెట్టారు. అయితే ఆ సీన్లని ఏదో బలవంతంగా కాకుండా ఎమోషనల్‌గా కనెక్ట్ చేస్తూ చూపించడం బాగుంది. ఇంటర్వెల్‌ వరకు హీరోహీరోయిన్ల మధ్య రిలేషన్‌, ఫన్‌, రొమాన్స్ ని ఆవిష్కరించారు. దీంతో ఇదొక ఫన్‌, కామెడీ, రొమాన్స్ మేళవింపులా రోలర్‌ కోస్టర్‌లా సాగుతుంది. అయితే సెకండాఫ్‌ మాత్రం కొంత ఎమోషనల్‌గా అనిపిస్తుంది. అమ్మాయితో ఫిజికల్ గా కలిసిన తర్వాత హీరో ఏడవడం విచిత్రంగా ఉంది. హిలేరియస్‌ కామెడీగా ఉంటుంది. అలాగని వల్గారిటీ లేదు. చాలా నీట్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో పాత్రల మధ్య సంఘర్షణని ఆవిష్కరించారు. రైటా? రాంగా? వారి వ్యక్తిగత విషయాలు, వారి ఆలోచిన విధానాలను కళ్లకి కట్టినట్టు చూపించారు. దీంతో కొంత లాగ్‌ అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ ని మాత్రం చాలా నీట్‌గా డీల్‌ చేశాడు. అక్కడే దర్శకుడి టాలెంట్‌ కనిపిస్తుంది. రొటీన్‌కి భిన్నంగా నడిపించినతీరు బాగుంది. ఆలోచింప చేసేలా ఉంది.

47
ఎపిక్‌లో ప్లస్‌, మైనస్ లు
Image Credit : X/@SitharaEnts

ఎపిక్‌లో ప్లస్‌, మైనస్ లు

సినిమాలో ఫన్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఫస్టాఫ్‌ మాత్రం అదిరిపోయింది. కామెడీ, రొమాన్స్, హీరోహీరోయిన్ల మధ్య కన్వర్జేషన్‌, డైలాగ్‌లు బాగున్నాయి. వాటితోనే సినిమా అలా గడిచిపోయింది. హీరోహీరోయిన్లు కూడా ఇరగదీశారు. ఇక సెకండాఫ్‌ కొంత స్లో అయ్యింది. కాని క్లైమాక్స్ అదిరిపోయింది. సినిమాలో లవ్‌ ట్రాక్‌, రొమాన్స్ అందంగా కుదిరాయి. ఆర్‌ఆర్‌ బాగా సెట్‌ అయ్యింది. చెప్పాలనుకున్న పాయింట్‌ బాగుంది. ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యాయి. కానీ మూవీలో సెకండాఫ్‌ లో కొన్ని చోట్ల క్లారిటీ లేదు. అక్కడక్కడే కథ తిరుగుతున్నట్టు ఉంటుంది. హీరో పాయింట్‌ ఆఫ్‌ వ్యూ, హీరోయిన్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ భిన్నంగా ఉంటుంది. వాటిని అంతే బాగా కలపడం విశేషం. స్క్రీన్‌ ప్లే చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. డైలాగ్‌లు, సీన్లు నీట్‌గా క్లాసీగా ఉన్నాయి. దర్శకుడు వాటిని అంతే బాగా తెరపై ఆవిష్కరించారు. కాకపోతే కొన్ని చోట్ల హీరోహీరోయిన్ల మధ్య గొడవలు వర్కౌట్ కాలేదు. డ్రామా ఆశించిన స్థాయిలో వర్కౌట్‌ కాదు. సెకండాఫ్‌లో కొంత డల్‌ ఫీలింగ్ తెప్పిస్తుంది. హీరోహీరోయిన్ పాత్రలు ప్రతి సాధారణ అబ్బాయి, అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. ఫారెన్‌ వెళ్లిన వారికి మాత్రం మరింత బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తంగా ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి తెరపై మరోసారి మ్యాజిక్‌ చేశారని చెప్పొచ్చు. రైటింగ్‌, డైలాగ్‌లు పెద్ద అసెట్‌. మ్యూజిక్‌ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. విజువల్స్ ప్లస్‌ అయ్యాయి.

57
ఎపిక్‌లో నటీనటులు ఎలా చేశారంటే?
Image Credit : Asianet News

ఎపిక్‌లో నటీనటులు ఎలా చేశారంటే?

ఆదిత్య పాత్రలో ఆనంద్‌ దేవరకొండ అదరగొట్టాడు. పాత్రలో జీవించాడు. సెటిల్డ్ పర్‌ఫెర్మెన్స్ బాగుంది. డైరెక్టర్‌గా తన ఆశలు, డ్రీమ్స్ ఫన్నీగా ఉన్నాయి. ఈ క్రమంలో సీన్లు ఆకట్టుకున్నాయి. ఆనంద్‌లో చాలా మెచ్యూర్డ్ యాక్టర్ కనిపిస్తున్నాడు. ఇన్నోసెంట్‌గా, అన్ని కావాలని కోరుకునే అబ్బాయిగా, పేరెంట్స్ నుంచి ఇబ్బంది పడే కుర్రాడిగా ఆనంద్‌ ఇరగదీశాడు. ఈ మూవీ ఆనంద్‌ కెరీర్‌ని మరో మెట్టు ఎక్కిస్తుందని చెప్పొచ్చు. కడలి పాత్రలో వైష్ణవి చైతన్య సైతం ఇరగదీసింది. ఓపెన్‌ అండ్‌ బోల్డ్ అమ్మాయిగా పాత్రలో జీవించింది. పాత్రకి ప్రాణం పోసింది. డామినేటింగ్‌ పాత్రలో అంతే బాగా చేసి ఆకట్టుకుంది. విభిన్నమైన ఎమోషన్స్ ని సింపుల్‌గా చేసింది. ఇరగదీసింది. లేడీ అర్జున్‌ రెడ్డిని తలపించింది. వీరితోపాటు తండ్రి పాత్రలో శివాజీ, తల్లి పాత్రలో వాసుకి ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. వారి పాత్రలు నవ్విస్తాయి. తర్వాత ఎమోషనల్‌కి గురి చేస్తాయి. యూకేలో ఫ్రెండ్‌గా గవిరెడ్డి సైతం అదరగొట్టాడు. ఫారెన్‌ వెళ్లిన వారికి ఈ పాత్ర బాగా నచ్చుతుంది. వీరితోపాటు దర్శకుడు కళ్యాణ్‌ శంకర్‌ పాత్ర సర్‌ప్రైజ్‌ చేస్తుంది. నవ్విస్తుంది. చివరికి ఆలోచింప చేస్తుంది. తను కూడా బాగా చేశాడు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

67
టెక్నీకల్‌గా ఎపిక్‌ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

టెక్నీకల్‌గా ఎపిక్‌ ఎలా ఉందంటే?

హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌.. సంగీతం సినిమాకి బ్యాక్ బోన్‌గా నిలుస్తుంది. సంచారమే పాట హైలైట్‌గా నిలిచింది. మిగిలిన పాటలు సైతం అలరించాయి. చాలా చోట్ల మ్యూజిక్‌ మాట్లాడుతుంది. హృదయాన్ని హత్తుకుంటుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ ఫర్వాలేదు. బాగా కట్‌ చేశాడు. సినిమా చాలా నీట్‌గా సాగింది. విజువల్స్ సినిమాకి మరో ప్లస్‌. చాలా చోట్ల విజువల్స్ పెయింటింగ్‌లా ఉన్నాయి. నిర్మాత నాగవంశీ రిచ్‌గా నిర్మించారు. ఇక దర్శకుడు ఆదిత్య హాసన్‌ ఈ మూవీ కథని అదిరిపోలా రాసుకున్నారు.. డైలాగ్‌లు అదిరిపోయాయి. చాలా వరకు రియాలిటీకి దగ్గరగా మూవీని తెరకెక్కించారు. ఇందులో హీరో పాత్రతో కుర్రాళ్లు రిలేట్‌ అవుతారు, హీరోయిన్‌ పాత్రతో చాలా మంది అమ్మాయిలు రిలేట్‌ అవుతారు. పేరెంట్స్ కి సంబంధించిన పాత్రలు పెద్దవాళ్లకి కనెక్ట్ అవుతాయి. ఇలా అందరిని ఆకట్టుకునేలా తెరకెక్కించారు.

77
ఫైనల్‌గా
Image Credit : Asianet News

ఫైనల్‌గా

ఫీల్‌గుడ్‌ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ ఎపిక్‌. జెంజీ కుర్రాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. మంచి యూత్‌ఫుల్‌ లవ్‌ రొమాంటిక్‌ కామెడీగా ఆకట్టుకుంటుంది, ఆలోచింప చేస్తుంది. బాధ్యతల్ని గుర్తు చేస్తుంది.

రేటింగ్‌: 3

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sardar 2 Movie Review: సర్దార్‌ 2 మూవీ రివ్యూ.. కార్తి, ఎస్‌ జే సూర్య నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
Gharana Mogudu Review: చిరంజీవి దెబ్బకు అమితాబచ్చన్ కు షాక్, మెగాస్టార్ మాస్ ఫాలోయింగ్ నిరూపించిన సినిమా.. ఘరానా మొగుడు రివ్యూ
Related Stories
Recommended image1
Mandaadi Movie Review: మండాడి మూవీ రివ్యూ.. సూరి హీరోగా సుహాస్‌ విలన్‌గా చేసిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Maremma Movie Review: మారెమ్మ మూవీ రివ్యూ.. రవితేజ తమ్ముడి కొడుకు హీరోగా ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved