MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు

Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు

సుమంత్‌ మొన్న `న్యూటన్స్ థర్డ్ లా`తో మెరిశారు. ఇప్పుడు `మహేంద్రగిరి వారాహి` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూద్దాం.

3 Min read
Author : Aithagoni Raju
Published : Sep 15 2026, 07:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మహేంద్రగిరి వారాహితో సుమంత్‌ సందడి
Image Credit : X/@rajashyamalae

మహేంద్రగిరి వారాహితో సుమంత్‌ సందడి

సుమంత్‌.. టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్‌ హీరో. ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో క్రమంగా తగ్గించారు. సెలక్టీవ్‌గా చేస్తూ వచ్చారు. కానీ ఇటీవల మళ్లీ ఆయన జోరు చూపిస్తున్నారు. అంతకు ముందు రెండు మూడేళ్లకి ఒక్కటి వస్తే, ఇప్పుడు నెల గ్యాప్‌తోనే రెండు సినిమాలతో సందడి చేశారు. ఇటీవల ఆయన `న్యూటన్స్ థర్డ్ లా` మూవీలో మెరిశారు. ఇది పెద్దగా ఆడలేదు. ఓటీటీ ఫిల్మ్ అన్నారు. ఇప్పుడు `మహేంద్రగిరి వారాహి` మూవీతో థియేటర్లో సందడి చేస్తున్నారు. ఇది ఈ నెల 11న విడుదలైంది. సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ గెస్ట్ రోల్‌ చేయగా, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటించారు. సిద్ధు జొన్నలగడ్డ మరో గెస్ట్ రోల్‌ చేశారు. వెన్నెల కిశోర్‌, బ్రహ్మానందం, రాజీవ్‌ కనకాల, అలీ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి నెగటివ్‌ టాక్‌ వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్టడీగా మహేంద్రగిరి వారాహి కలెక్షన్లు
Image Credit : X/@rajashyamalae

స్టడీగా మహేంద్రగిరి వారాహి కలెక్షన్లు

మరి నెగటివ్ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూస్తే, ఇది థియేట్రికల్‌గా పెద్దగా సత్తా చాటడం లేదని తెలుస్తోంది. అయితే వరుసగా నాలుగు రోజులు సెలవులు కావడంతో కలెక్షన్లలో తేడా లేదు. కానీ మరీ తక్కువగా ఉండటం గమనార్హం. ఈ మూవీ సోమవారం రూ.66లక్షలు వసూలు చేసింది. ఇది మొదటి రోజుకంటే ఒక లక్ష ఎక్కువ. ఫస్ట్ డే దీనికి రూ.65లక్షలు వస్తే, రెండో రోజు రూ.77లక్షలు వచ్చాయి. మూడో రోజు ఆదివారం రూ.69 లక్షలు వచ్చాయి. నెమ్మదిగా పుంజుకున్న ఈ చిత్రం సోమవారం మాత్రం కొద్దిగా తగ్గాయి. అయితే ఇది పెద్ద తగ్గింపు కాదు. కానీ ఓవరాల్‌గా చూస్తే ఇవి చాలా తక్కువ కలెక్షన్లు గా చెప్పొచ్చు.

34
మహేంద్రగిరి వారాహి టోటల్‌ కలెక్షన్లు
Image Credit : X/@rajashyamalae

మహేంద్రగిరి వారాహి టోటల్‌ కలెక్షన్లు

మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ సినిమాకి రూ.2.77కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వచ్చినట్టు సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది. ఈ లెక్కన రూ.2.45కోట్ల నెట్‌ రాబట్టింది. ఇది కోటిన్నర షేర్‌గా చెప్పొచ్చు. ఈ సినిమాకి అయిన బడ్జెట్‌ రూ.26కోట్లు. నాన్‌ థియేట్రికల్‌గా అంటే శాటిలైట్‌, ఓటీటీ, ఆడియో రూపంలో సగం వచ్చాయట. ఇక సగం థియేట్రికల్‌గా తేల్చుకోవాలి. అంటే సుమారు రూ.12-13కోట్లు థియేట్రికల్‌గా వసూలు చేయాలి. ఈ లెక్కన ఈ మూవీ దాదాపు రూ.25కోట్ల గ్రాస్‌ రావాలి. కానీ అందులో ఇది కేవలం పది శాతం మాత్రమే రాబట్టింది. ఇంకా ఇరవై కోట్లకుపైగా గ్రాస్‌ రావాలి. సినిమా మూమెంట్‌ చూస్తే కనీసం ఐదు కోట్ల వరకు కూడా వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మంగళవారం నుంచి వీక్‌ డేస్‌. కలెక్షన్లు భారీగా పడిపోతాయి. ఇది మూవీకి గట్టి దెబ్బగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఎంత వరకు సత్తా చాటుతుందో చూడాలి.

44
మహేంద్రగిరి వారాహి మూవీ కథ
Image Credit : X/@rajashyamalae

మహేంద్రగిరి వారాహి మూవీ కథ

మహేంద్రగిరి రాజవంశాన్ని 200 ఏళ్లుగా వారాహి అమ్మవారి శాపం వెంటాడుతుంటుంది. ఆ కుటుంబంలో జన్మించిన ప్రతి మగాడు 33వ జన్మతిథి రోజు కన్నుమూస్తుంటారు. అది యాక్సిడెంట్‌గానే జరుగుతుంటుంది. అమ్మవారే స్వయంగా వచ్చి ప్రాణాలు తీస్తుంటుంది. అందుకు కారణం ఆ వంశంలో మహేంద్రవర్మ అనే రాజు.. మహేంద్రగిరి అమ్మవారి దేవాలయంలో ఉన్న అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడటమే. ఆ శాప విముక్తికోసం రాజవంశానికి చెందినవారు అనేక రకాల పూజలు చేస్తారు. కానీ ఫలితం ఉండదు. దీన్ని రాజేంద్ర వర్మ(సిద్ధు జొన్నలగడ్డ) సైతం ఎదురిస్తాడు. కానీ ఆ శాపానికి బలవుతాడు. అతని భార్య సుజాత(మాళవిక మోహనన్‌) అప్పటికే గర్భవతి. ఆమె కూడా కారు ప్రమాదంలో గాయపడుతుంది. కానీ ఆమె ఏమైందనేది సస్పెన్స్. ఇక ప్రస్తుతం రాజవంశంలో మగాళ్లు లేదు. కానీ కూతురు కొడుకు ఉంటాడు. అతను కూడా వీరి రక్తమే కావడంతో ఆ శాపం వారికి కూడా వర్తిస్తుంటుందంటారు. మరి అతనికి కూడా అదే శాపం వెంటాడిందా? లేదా? ఇందులోని రహస్యాన్ని హీరో ఎలా బయటపెట్టాడు? అనేది కథ. సినిమా కథబాగున్నా, నీరసంగా సాగడం పెద్దమైనస్‌. ట్విస్ట్ లు పెద్దగా కిక్‌ ఇవ్వలేదు. ఎమోషన్స్ క్యారీ కాలేదు. ఫైనల్‌ ట్విస్ట్ ఆడియెన్స్ తీసుకోలేకపోయారు. దీంతో మూవీకి నెగటివ్‌ టాక్‌ వచ్చింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Eesha Rebba: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా రిలేషన్ అఫీషియల్, పండగ రోజు గుడ్ న్యూస్..సెలెబ్రిటీల రియాక్షన్ చూశారా
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved