MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్

BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్

BRICS Summit 2026: ఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్ 2026 లో భారత్ తెచ్చిన ఆ 3 ప్లాన్స్ పాశ్చాత్య దేశాలకు షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా డాలర్ కు షాకిస్తూ.. ట్రంప్‌నకు చెమటలు పట్టిస్తున్న ప్రతిపాదనలు చేయడం ఈ సదస్సుతో భారత్ సాధించిన అతిపెద్ద విజయం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 13 2026, 09:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్.. గ్లోబల్ పవర్ సెంటర్‌గా ఇండియా
Image Credit : chatgpt

న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సమ్మిట్.. గ్లోబల్ పవర్ సెంటర్‌గా ఇండియా

దేశ రాజధాని న్యూఢిల్లీ ఇప్పుడు ప్రపంచానికి పవర్ సెంటర్‌గా మారింది. ప్రతిష్ఠాత్మక 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు 2026 ఇక్కడే ఎంతో వైభవంగా జరుగుతోంది. చైనా, రష్యా, బ్రెజిల్, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల అగ్రనేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు ఢిల్లీ నగరాన్ని పూర్తిస్థాయిలో భద్రతా బలగాల పహారాలో ఉంచారు.

మొత్తం 11 సభ్య దేశాలు, 10 భాగస్వామ్య దేశాల ప్రతినిధులు భారత్‌కు చేరుకున్నారు. ఈ సమ్మిట్ సందర్భంగా చైనా, రష్యా, ఇరాన్ దేశాలతో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతోంది. అయితే ఈ మహా సదస్సు వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చే లాభం ఏంటి? అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డాలర్‌కు ప్రత్యామ్నాయం.. లోకల్ కరెన్సీ వ్యాపారానికి భారత్ పిలుపు
Image Credit : X/BricsIndia2026

డాలర్‌కు ప్రత్యామ్నాయం.. లోకల్ కరెన్సీ వ్యాపారానికి భారత్ పిలుపు

పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి చెక్ పెడుతూ భారత్ బ్రిక్స్ సమ్మిట్ లో సంచలన ప్రతిపాదనలు చేసింది. ఈ సదస్సు నుంచి భారత్ ఏం ఆశిస్తోందో కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ఎస్. జైశంకర్ తమ ప్రసంగాల ద్వారా స్పష్టం చేశారు. 'బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ 2026' ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిక్స్ దేశాల కోసం కొత్తగా ఏదైనా ఉమ్మడి కరెన్సీని తీసుకురావడానికి బదులుగా, సభ్య దేశాలు తమ స్వదేశీ కరెన్సీలలోనే వ్యాపారం చేసుకోవాలని ఆయన ప్రతిపాదించారు. అంటే భారత్, చైనాల మధ్య వ్యాపారం జరిగితే చెల్లింపులు రూపాయి, యువాన్లలోనే జరగాలి. దీనివల్ల అమెరికన్ డాలర్‌పై ఆధారపడటం పూర్తిగా తగ్గుతుంది.

35
యూపీఐ మోడల్ విప్లవం.. బ్రిక్స్ దేశాల డిజిటల్ అనుసంధానం
Image Credit : X/BricsIndia2026

యూపీఐ మోడల్ విప్లవం.. బ్రిక్స్ దేశాల డిజిటల్ అనుసంధానం

కేవలం లోకల్ కరెన్సీ ట్రేడింగ్ మాత్రమే కాకుండా, బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయాలని భారత్ కోరింది. భారత్‌లో విజయవంతమైన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) మోడల్‌ను పియూష్ గోయల్ ఉదాహరణగా చూపించారు. భారతదేశంలో యూపీఐ ద్వారా వేగవంతమైన, సురక్షితమైన లావాదేవీలు ఎలా జరుగుతున్నాయో వివరిస్తూ, బ్రిక్స్ దేశాలన్నీ తమ పేమెంట్ సిస్టమ్‌లను ఒకదానితో ఒకటి అనుసంధానించాలని పిలుపునిచ్చారు. దీనివల్ల సరిహద్దులు దాటి జరిగే వ్యాపార చెల్లింపులు చాలా సులభంగా, వేగంగా పూర్తవుతాయని, వ్యాపార వ్యయం తగ్గుతుందని భారత్ స్పష్టం చేసింది.

45
చమురు, ఎల్‌పీజీ సంక్షోభానికి జైశంకర్ కొత్త ఫార్ములా
Image Credit : X/BricsIndia2026

చమురు, ఎల్‌పీజీ సంక్షోభానికి జైశంకర్ కొత్త ఫార్ములా

ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న సమస్యల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు, ఎల్‌పీజీ సంక్షోభం తలెత్తుతోంది. ఈ సమస్యకు బ్రిక్స్ సమ్మిట్ లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బలమైన పరిష్కారాన్ని చూపించారు. బ్రిక్స్ దేశాలన్నీ కలిసి ఒక కొత్త రకాల ఎనర్జీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకోవాలని జైశంకర్ పిలుపునిచ్చారు. ఎలాంటి భౌగోళిక-రాజకీయ లేదా యుద్ధ సంక్షోభాలు ఎదురైనా తట్టుకునేలా ఒక స్వతంత్ర ఇంధన సరఫరా వ్యవస్థను ఏర్పరచుకోవాలన్నారు. ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, రష్యా వంటి ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు ఈ కూటమిలో ఉండటం భారత్‌కు కలసివచ్చే అంశం.

55
అమెరికా భయం ఏంటి? గ్లోబల్ ఎకానమీపై బ్రిక్స్ ప్రభావం ఎంత?
Image Credit : X/BricsIndia2026

అమెరికా భయం ఏంటి? గ్లోబల్ ఎకానమీపై బ్రిక్స్ ప్రభావం ఎంత?

గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (GTRI) డేటా ప్రకారం, ఆర్థిక సంవత్సరం 2025లో బ్రిక్స్ దేశాలు ఏకంగా 5.67 ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువులను ఎగుమతి చేశాయి. ఇది ప్రపంచ మొత్తం ఎగుమతుల్లో 21.6 శాతానికి సమానం. అయితే బ్రిక్స్ దేశాల మధ్య అంతర్గత ఎగుమతులు 1.1 ట్రిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఇది వాటి మొత్తం ఎగుమతుల్లో 18.8 శాతం మాత్రమే. భారత్ విషయానికి వస్తే, ఆర్థిక సంవత్సరం 2026లో బ్రిక్స్ దేశాలతో ట్రేడ్ డెఫిసిట్ 226.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2021లో ఇది 74.5 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండేది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాల సంయుక్త జీడీపీ ఏకంగా 41 శాతంగా ఉంది. ప్రపంచ జనాభాలో ప్రతి ఇద్దరిలో ఒకరు బ్రిక్స్ దేశాల్లోనే నివసిస్తున్నారు. ప్రపంచ వ్యాపారంలో బ్రిక్స్ వాటా 26 శాతంగా ఉంది. ఒకవేళ బ్రిక్స్ దేశాల మధ్య అంతర్గత వ్యాపారం పెరిగి, చెల్లింపులు స్వదేశీ కరెన్సీలలో జరిగితే పాశ్చాత్య దేశాల మార్కెట్లపై ఆధారపడటం తగ్గుతుంది. చైనా, రష్యా వంటి తయారీ కేంద్రాలు, ఇరాన్, సౌదీ వంటి ఇంధన వనరులు, భారత్ వంటి భారీ మార్కెట్ ఒకే కూటమిలో ఉండటం వల్ల డాలర్ ఆధిపత్యం దెబ్బతింటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేసే టారిఫ్ బెదిరింపులు కూడా పనిచేయవు. అందుకే అమెరికా ఈ బ్రిక్స్ సమ్మిట్‌ను చూసి తీవ్ర ఆందోళన చెందుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
చైనా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
నరేంద్ర మోదీ
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post office: రూ. 5 ల‌క్ష‌ల పెట్టుబ‌డితో రూ. 7.25 ల‌క్ష‌లు పొందొచ్చు.. జీరో రిస్క్
Recommended image2
Home Loan : సిబిల్ స్కోర్ తక్కువున్నా హోమ్ లోన్ కావాలా? అయితే ఈ 7 టిప్స్ పాటించండి
Recommended image3
జనరల్ బోగీలు.. రైలు ముందు, వెనుకే ఎందుకు ఉంటాయి? అసలు కారణం ఇదే
Related Stories
Recommended image1
Seed Ganesha Idols: చిరంజీవి మెచ్చిన సీడ్ గణేష.. సీడ్ వినాయకుడితో మనకు వచ్చే 5 మైండ్ బ్లాకింగ్ బెనిఫిట్స్ ఇవే
Recommended image2
Farmer Success Story: ఒక ఎకరం పొలంలో రోజుకు 12 వేల ఆదాయం.. ఈ యువరైతు ఎలా సంపాదిస్తున్నాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved