టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సినీ నటి ఊర్వశీ రౌతేలా హగ్ చేసుకున్న ఫోటో ఇప్పుడు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా భారత్-పాక్ జట్లు తలపడిన సంగతి తెలిసిందే. జట్టును విజయపథంలో దూసుకువెళ్లేలా చేసిన కోహ్లీపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా తన అభిమానాన్ని చాటుకున్నారు. 

మొదటి నుంచి క్రికెట్ కి వీరాభిమాని అయిన ఊర్వశి... ఈ మ్యాచ్ గెలిచిన ఆనందంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని హగ్ చేసుకొంది. అనంతరం ఫోటో దిగింది. ఆ ఫోటని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో విపరీతంగా వైరల్ అయ్యింది. నెటిజన్ల నుంచి కూడా విపరీతంగా స్పందన వస్తోంది.

కొందరు ఫోటో బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తుంటే... మరి కొందరు మాత్రం అనుష్క తో జాగ్రత్తగా ఉండూ అంటూ సరదాగా హెచ్చరిస్తున్నారు. కోహ్లీని ఊర్వశి హగ్ చేసుకున్న ఫోటో చూసి అనుష్క శర్మ హర్ట్ అయ్యిందంటూ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు.

‘‘అనుష్క నీవు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవాలనుకుంటోంది’’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ‘‘నీ ఫోన్ చూసుకో, నీకు అనుష్క మెసేజ్ చేసి ఉంటుంది’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఊర్వశీ పెట్టిన ఫోటోపై నెటిజన్ల కామెంట్లతో ఆమె సోషల్ మీడియా ఖాతా నిండిపోయింది. కోహ్లీతో ఊర్వశీ ఫోటో చూసి అనుష్క దిగులుగా ఉందంటూ మరో నెటిజన్ ఓ ఫోటోను జోడించారు. అనుష్క నిన్ను కొడుతది అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఊర్వశీ రౌతేలా హిందీతోపాటు పలు తెలుగుచిత్రాల్లోనూ నటించింది