అమరావతి: ఎన్టీఆర్‌కు ఆత్మాభిమానం ఎక్కువే....తెలుగు వాళ్లను తక్కువ చేసి చూపితే సహించేవాడు కాదు.. తెలుగువాళ్లను తెలుగువాళ్లుగా చూడాలని కోరుకొనేవాడు. మద్రాసీలుగా తెలుగువాళ్లను చూడడాన్ని ఆయన ఏనాడూ కూడ  జీర్ణించుకోలేదు. మొండితనం కూడ ఎక్కువే.. తాను  అనుకొన్నది సాధించేవాడు.ఈ విషయాలను కథానాయకుడు సినిమాలో తెరకెక్కించారు.

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు సినిమా జనవరి 9వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీ రంగంలో ప్రవేశం నుండి  పార్టీ ఏర్పాటు వరకు చూపించారు.

సబ్‌ రిజిష్ట్రార్‌గా ఎన్టీఆర్ పనిచేసే సమయంలో  ఓ రైతు తన భూమి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన సమయంలో అక్కడి అధికారులు అవినీతికి పాల్పడితే దాన్ని ఎన్టీఆర్ తీవ్రంగా ప్రతిఘటించాడు.

 ఆ రైతు భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేయిస్తాడు. అధికారులు డబ్బులు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తాడు. అవినీతికి ఆమడ దూరంగా తాను ఉంటానని చెబుతాడు. ఉద్యోగానికి రాజీనామా చేస్తాడు.  సబ్ రిజిష్ట్రార్ ఉద్యోగానికి ఎన్టీఆర్ రాజీనామా  చేసిన తర్వాత సినిమాలో వేషం కోసం మద్రాసు వెళ్లడాన్ని చూపించారు.

పద్మశ్రీ అవార్డును  తీసుకొనే సమయంలో ఇందిరాగాంధీ తమను మద్రాసీలు అంటూ చేసిన వ్యాఖ్యలను ఎన్టీఆర్ వ్యతిరేకించారు. తాము మద్రాసీలం కాదు. తెలుగు వాళ్లమని ఏపీ రాష్ట్రానికి చెందినవారమని గట్టిగానే చెబుతారు. తెలుగువారమై ఉండి కూడ మద్రాసీలుగా తమను గుర్తించడాన్ని  ఆయన జీర్ణించుకోలేక ఇందిరాగాంధీ వద్దే  ఆవేశంగా మాట్లాడుతాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఎన్నాఆర్ ఈ విషయాన్ని ఇందిరాగాంధీ సున్నితంగా చెప్పినట్టుగా సినిమాలో చూపించారు.

రాయలసీమలో నెలకొన్న కరువు కారణంగా ప్రజలను ఆదుకొనేందుకు విరాళాలను సేకరిస్తారు. ఈ విరాళాలను సీఎం సహాయనిధిని చేర్చాలని  విజయ సంస్థ నాగిరెడ్డికి అందిస్తారు. అయితే అప్పుడు విజయ సంస్థతో ఎన్టీఆర్ అగ్రిమెంట్ ఉంది. 

సినీ తారలు నేరుగా ప్రజల్లోకి వెళ్తే జనం సినిమాహాళ్లకు రారనే భయంతో నాగిరెడ్డి ఎన్టీఆర్‌తో గొడవకు దిగుతాడు. అయితే తాము సేకరించిన నిధిని రామకృష్ణ మఠం ద్వారా చేర్చేలా ఏర్పాట్లు చేస్తాడు. అంతేకాదు విజయ సంస్థతో తెగదెంపులు చేసుకొన్నట్టుగా సినిమాలో చూపించారు.

ఆ తర్వాత విజయ సంస్థకు చెందిన చక్రపాణి వచ్చి ఎన్టీఆర్‌తో మరో సినిమా కోసం అగ్రిమెంట్ కుదుర్చుకొన్నట్టుగా  సినిమాలో దృశ్యాలు ఉన్నాయి. తెలుగు వారిగా గుర్తింపు ఉండాలని ఎన్టీఆర్ ఎప్పుడూ పరితపించిపోయేవాడు. ఎన్నాఆర్ హైద్రాబాద్‌కు తన మకాన్ని మార్చి స్టూడియో నిర్మించాడు. అదే సమయంలో  ఎన్టీఆర్ కూడ హైద్రాబాద్‌కు మారి స్టూడియో నిర్మిస్తానని విజయ సంస్థ నాగిరెడ్డితో చెబుతాడు.

ఎఎన్నాఆర్‌తో కలిసి దానవీరశూరకర్ణ అనే సినిమా తీయాలని ఎన్టీఆర్ భావిస్తాడు. అయితే పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్‌తో నటించకూడదని గతంలోనే నిర్ణయం తీసుకొన్న విషయాన్ని అక్కినేని ఎన్టీఆర్‌ దృష్టికి తెస్తాడు. దీంతో  దానవీరశూరకర్ణ సినిమాలో  ఎన్టీఆర్ నాలుగు పాత్రలను తానే పోషిస్తాడు.ఈ సినిమాకు కూడ ఎన్టీఆర్ దర్శకత్వం వహించాడు. 

అయితే అదే సమయంలో చాణక్య చంద్రగుప్త సినిమాలో నటిస్తానని అక్కినేని ఎన్టీఆర్‌కు మాటిస్తారు. అయితే చాణక్య పాత్రను  తన కోసం రాసుకొన్నానని... ఈ పాత్రను నీ కోసం త్యాగం చేస్తా...బొనేను చంద్రగుప్తుడిగా నటిస్తానని ఎన్టీఆర్ అక్కినేనికి మాటిచ్చినట్టుగా  ఈ సినిమాలో చూపించారు.

ఆ సమయంలో  కుర్రహీరోలతో పోటీపడగలవా అంటూ ఎన్టీఆర్‌తో అంటాడు. తనకు విజయమే సిద్ధిస్తోందని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాతే యమగోల, అడవి రాముడు సినిమాల్లో ఎన్టీఆర్  నటిస్తారు. ఈ సినిమాల్లో కుర్రహీరోయిన్లతో ఆడి పాడినట్టుగా చూపారు.

ఎన్టీఆర్ తన స్వంత బ్యానర్‌పై రావణుడి జీవిత చరిత్ర ఆధారంగా  సినిమా తీయాలని సంకల్పించారు. ఆ సినిమాకు దర్శకత్వం వహించాలని  కెవి రెడ్డిని అడుగుతారు. అయితే తాను మాత్రం ఆ సినిమాకు దర్శకత్వం వహించేందుకు నిరాకరిస్తే  సీతారామ కళ్యాణం పేరుతో సినిమాకు తానే దర్శకత్వం వహించి సినిమా తీస్తాడు. ఈ సినిమాలో  ఓ సీన్‌ షూటింగ్ కోసం ఏకంగా 20 గంటల పాటు  కదలకుండా అలాగే నిలబడతాడు. తెలుగు సినిమాలో  ఆ దృశ్యం అప్పట్లో సంచలనంగా పేరొంది. ఈ దృశ్యాలను  సినిమాలో తెరకెక్కించారు.

రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయాన్ని తమ్ముడు త్రివిక్రమరావు వ్యతిరేకిస్తారు. సినిమాల్లో అన్నకు చేదోడువాదోడుగా ఉన్న త్రివిక్రమరావు మాత్రం రాజకీయాల్లో మాత్రం వెంట నిలబడలేనని స్పష్టం చేశాడు. అంతేకాదు భార్య బసవతారకం కూడ రాజకీయాల్లో చేరడాన్ని వ్యతిరేకిస్తోంది. కానీ, చివరకు ఆయన నిర్ణయంతో ఏకీభవించి హైద్రాబాద్‌కు వెళ్లే సమయంలో  మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి మరీ సాగనంపుతోంది. హరికృష్ణ మాత్రమే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించినట్టుగా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

కథానాయకుడు సినిమాలో టీడీపీ ఆవిర్భావ నేపథ్యమిదీ...

కథానాయకుడు సినిమా: ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్‌కౌంటర్

కథానాయకుడు సినిమాలో రామోజీ పాత్ర ఇదీ....

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?