MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Report: ఇక కాస్కోండి.. వ‌చ్చే వారం చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయం. ఎండ‌లు మాముల‌గా ఉండ‌వు

Weather Report: ఇక కాస్కోండి.. వ‌చ్చే వారం చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయం. ఎండ‌లు మాముల‌గా ఉండ‌వు

Weather Report: చ‌లి తీవ్ర‌త క్ర‌మంగా త‌గ్గుతోంది. వేస‌వి ప్ర‌భావంగా పెరుగుతోంది. వ‌చ్చే వారంలో ఎండ‌లు దంచికొట్ట‌డం ఖాయ‌మ‌ని వాతావ‌ర‌ణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్ష సూచనలు చాలా తక్కువగా ఉండటంతో ఎండ తీవ్రత రోజురోజుకి పెర‌గ‌నుంద‌న్నారు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 28 2026, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు
Image Credit : Getty

ఏపీలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పగటిపూట ఎండ తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 32 డిగ్రీల వరకు చేరగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల వద్ద నమోదయ్యాయి. ఉదయం, రాత్రి వేళల్లో కొద్దిగా చల్లదనం ఉన్నప్పటికీ మధ్యాహ్నం వేళల్లో వేడి తీవ్ర‌త పెరుగుతోంది. ఉదయం 6 గంటల సమయంలో 22 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత 9 గంటలకు 26 డిగ్రీలకు పెరిగింది. మధ్యాహ్నం సమయానికి 31 డిగ్రీల వరకు చేరి సాయంత్రం వరకు అదే స్థాయిలో కొన‌సాగుతోంది. తరువాత సాయంత్రం నుంచి క్రమంగా తగ్గుతూ రాత్రి వేళల్లో 24–25 డిగ్రీల మధ్య నమోదైంది.

25
వర్ష సూచనలు తగ్గుముఖం
Image Credit : Getty

వర్ష సూచనలు తగ్గుముఖం

ప్రస్తుతం రాష్ట్రంలో వర్షపాతం అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. వర్ష సూచీ సుమారు 5 శాతానికి పరిమితమైంది. గాలుల వేగం గంటకు సుమారు 19 కిలోమీటర్ల వరకు ఉండగా, తేమ శాతం సుమారు 60గా నమోదవుతోంది. ఈ పరిస్థితులు వేసవి ప్రారంభానికి సంకేతాలుగా భావిస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మార్చి, ఏప్రిల్ నెలల్లో మరింత వేడి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Related Articles

Related image1
ఇప్పుడే నిమ్మ ర‌సాన్ని ఇలా స్టోర్ చేసుకుంటే స‌మ్మ‌ర్‌లో బిందాస్‌.. ఒక్క నిమ్మ‌కాయ రూ. 10 కావ‌డం ఖాయం
Related image2
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
35
వచ్చే వారం ఉష్ణోగ్రతల అంచనా
Image Credit : Asianet News

వచ్చే వారం ఉష్ణోగ్రతల అంచనా

వచ్చే వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముంది. సాధారణంగా 31 నుంచి 35 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఆదివారం – 32°C / 23°C, సోమవారం – 33°C / 23°C, మంగళవారం – 33°C / 23°C, బుధవారం – 33°C / 22°C, గురువారం – 35°C / 24°C, శుక్రవారం – 32°C / 23°C, శనివారం – 31°C / 22°C న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

45
తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు
Image Credit : Gemini

తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా మారుతోన్న నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మార్పుతో జ్వ‌రాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండలో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడాలి. రోజంతా తగినంత నీరు తాగడం అవసరం. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగకుండా ఉండటం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ వాడటం మంచిదని సూచిస్తున్నారు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుంది.

55
తెలంగాణలో కూడా పెరుగుతున్న ఎండలు
Image Credit : twitter

తెలంగాణలో కూడా పెరుగుతున్న ఎండలు

తెలంగాణలో కూడా వేసవి ప్రభావం ప్రారంభమైంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల మధ్య ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రతలు 21 నుంచి 23 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. తేమ శాతం 30–40 మధ్య ఉండటం వల్ల మధ్యాహ్నం వేళల్లో ఉక్కపోత అనిపించే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేసవి ప్రభావం ముందుగానే కనిపిస్తోంది. వచ్చే రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వాతావరణం
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
Recommended image2
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్
Recommended image3
Free Bus Travel : మహిళలు, దివ్యాంగులతో పాటు వీరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం
Related Stories
Recommended image1
ఇప్పుడే నిమ్మ ర‌సాన్ని ఇలా స్టోర్ చేసుకుంటే స‌మ్మ‌ర్‌లో బిందాస్‌.. ఒక్క నిమ్మ‌కాయ రూ. 10 కావ‌డం ఖాయం
Recommended image2
Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved