టాలీవుడ్ లో ప్రస్తుతం అందరి చూపు ఎన్టీఆర్ బయోపిక్ పైనే ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  అయితే ఈ సినిమా మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సెన్సార్ పనులను ఫినిష్ చేసుకుంది. గురువారం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి ఫైనల్ కట్ వీక్షించిన అనంతరం దర్శకుడు క్రిష్ నేడు సినిమాను సెన్సార్ బోర్డుకు పంపాడు. 

అయితే సినిమాకు ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ యూనిట్ క్లీన్ యూ సర్టిఫికెట్ ను జారీ చేసింది. సినిమాలో రెండు పాత్రలకు సంబందించి నిన్నటివరకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే కథానాయకుడు సినిమాలో అలాంటి సీన్స్ కి దర్శకుడు తావివ్వలేదని తెలుస్తోంది. మహానాయకుడు విషయంలో ఆ ఇబ్బందులు ఉండవచ్చని టాక్. 

ఇక ఫస్ట్ పార్ట్ లో క్రిష్ ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఎంతో ఎమోషన ల్ గా తెరకెక్కించినట్లు సెన్సార్ యూనిట్ నుంచి టాక్ వస్తోంది. బాలకృష్ణ నటన కూడా సినిమాలో అద్భుతంగా ఉందని ముఖ్యంగా పాత్రల ప్రజెంటేషన్  ఆకట్టుకుంటాయని అంటున్నారు. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రధానం ఆయువులా నిలిచిందని ప్రశంసలు అందుతున్నాయి. మరి కథానాయకుడు సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.