రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తోన్న చిత్రం 'ఎన్టీఆర్' బయోపిక్. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి.

సినిమా విడుదలకు సిద్ధమవుతుండడంతో సినిమాకు సంబంధించి పలు విషయాలను చిత్రబృందం ప్రేక్షకులతో పంచుకుంటుంది. ఈ సినిమాలో నటుడు హరికృష్ణ పాత్రలో ఆయన కొడుకు కళ్యాణ్ రామ్ ని తీసుకుంటే, ఏఎన్నార్ పాత్రలో సుమంత్ ని తీసుకున్నారు. నాగార్జున ఉండగా సుమంత్ ని తీసుకోవడంపై స్పందించిన బాలయ్య.. నాగార్జున కంటే ఏఎన్నార్ పోలికలు సుమంత్ లో ఎక్కువగా కనిపిస్తాయని అన్నారు. 

ఆయన మాట్లాడుతూ.. ''సుమంత్ ని అక్కినేని పాత్రలో తీసుకున్నాం. నాగార్జున కంటే సుమంత్ లో ఏఎన్నార్ పోలికలు ఎక్కువ. పైగా అతడు తాత దగ్గర పెరగడంతో ఆ పాత్రలో లీనమైపోయాడు. ఆ పాత్ర పోషిస్తే  చాలు.. కానీ ఆయన శైలిని, డైలాగ్ డెలివరీని అనుకరించవద్దని చెప్పాను. నేను చెప్పినట్లుగానే చేశాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల జర్నీ ఈ సినిమాలో ఎక్కువగా చూపించాం. మధ్యలో వారి మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చి ఉండొచ్చు. అలాంటివి సహజం. కానీ సినిమాలో వారి స్నేహబందాన్నే ఎక్కువగా చూపించాం'' అంటూ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు.. 

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?