Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

రైతుబిడ్డగా జన్మించి , కళామ్మతల్లి ముద్దుబిడ్డగా పెరిగి, తెలుగు చలనచిత్ర రంగానికి రారాజుగా ఎదిగి , తెలుగు వాడంటే మద్రాసి కాదు ఆంధ్రుడు అని ప్రపంచానికి చాటిచెప్పిన మన తెలుగింటి రాముడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు , పద్మశ్రీ అన్న నందమూరి తారకరాముడు జీవిత విశేషాలు తెలుసుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుంది.

ntr kathanayakudu movie review
Author
Hyderabad, First Published Jan 9, 2019, 11:38 AM IST

---సూర్య ప్రకాష్ జోశ్యుల

రైతుబిడ్డగా జన్మించి , కళామ్మతల్లి ముద్దుబిడ్డగా పెరిగి, తెలుగు చలనచిత్ర రంగానికి రారాజుగా ఎదిగి , తెలుగు వాడంటే మద్రాసి కాదు ఆంధ్రుడు అని ప్రపంచానికి చాటిచెప్పిన మన తెలుగింటి రాముడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు , పద్మశ్రీ అన్న నందమూరి తారకరాముడు జీవిత విశేషాలు తెలుసుకోవాలని ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అయితే ఆయనలా తెరపై కనిపించగలవారెవ్వరు..? మహా సముద్రం లాంటి ఆయన జీవితాన్ని మధించి,కొన్ని అంశాలను ఎంచి అందించే వారు ఎవరు..? ఈ ప్రశ్నలకు సమాధానం ఇంతకాలం దొరకలేదు. దొరికిన మరుక్షణం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’రూపొంది మన ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అన్నగారి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు తెరకెక్కించారా..? ఏ అంశాలను ఈ బయోపిక్ లో టచ్ చేసారు..? ఏవి వదిలేసారు..? అసలు ఈ సినిమా కథేంటి..? తరాల భేధం లేకుండా అందరికీ నచ్చుతుందా..? వంటి విషయాలను రివ్యూలో చూద్దాం. 

కథేంటి..

నందమూరి తారకరామారావు అనే వ్యక్తి...ఎన్టీఆర్ అనే శక్తిగా ఆ తర్వాత ఎనివోడుగా ఎలా జనాల్లోకి వారి ,మనస్సులోకి వెళ్లారు అనే విషయం తెలుగువారందిరకీ తెలుసు. అవే అంశాలను  క్రోడీకరించుకుంటూ ..డాక్యుమెంటైజ్ చేస్తూ కథ  సాగుతుంది. ఉన్న కథ వంటి ఆ కథనాన్నే గుర్తు చేసుకుంటే..

సినిమా ప్రారంభం ... బ‌స‌వ‌తార‌కం(విద్యాబాల‌న్‌) క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. తన తల్లి  ఆరోగ్య ప‌రిస్థితి గురించి హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్‌రామ్‌) ఆందోళ‌న‌కు గుర‌వుతూ ఉంటారు. ఆ  చికిత్స తీసుకుంటున్న సమయంలో  బ‌స‌వ‌తార‌కం ....ఎన్టీఆర్ ఆల్బ‌మ్‌ను తిర‌గేస్తూ ఉండ‌టంతో య‌న్‌.టి.ఆర్‌..జీవితంలో అప్పటివరకూ జరిగిన విషయాలన్ని ఆవిష్కృతమవుతాయి.  అసలు ఎక్కడో విజయవాడలో సబ్ రిజస్టార్ జాబ్ లో ఉన్న నందమూరి రామారావు ..(బాల‌కృష్ణ‌) కు సినిమాల్లోకి ఎందుకు వెళ్లాలనిపించింది? సినిమాల్లో రాణించటానికి ఏ అడ్డంకులు ఎదుర్కొన్నారు? ఒక సాధార‌ణ నటుడుగా ..  గొప్ప స్టార్‌గా  ఎలా ఎదిగారు..పార్టీ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది. అలాగే తండ్రి పాత్ర‌లో బాల‌కృష్ణ ఎలా కనిపించారు..ఒప్పించ గలిగారా.. వంటి విషాయుల తెలియాలంటే సినిమా చూడాల్సిందే! 

ntr kathanayakudu movie review

 

క్రిష్...కథనం..

గతంలో క్రిష్ ..బాలయ్య కాంబోలో వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాకు..విషయం తక్కువ..విశ్లేషణ ఎక్కువలా...కథ తక్కువ యాక్షన్ సీన్స్ ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు ఈ ఎన్టీఆర్..కథా నాయకుడు విషయానికి వచ్చేసరికి...సీన్ రివర్స్ అయ్యింది. చెప్పాల్సిన విషయం ఎక్కువ...అందుకు తీసుకున్న సమయం తక్కువ అయ్యింది.  ఇలాంటి అందరికీ తెలుసున్న కథలో ..తన జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, కుటుంబం, ఎదుగుదల ..ఎత్తులు, పల్లాలు వాటికే ప్రయారిటీ ఇచ్చారు.

దాంతో   సినిమా అంతా పైపైన చూపాడన్న ఫీల్ వచ్చింది. అది వరసపెట్టి వేసిన గెటప్స్ వల్ల కావచ్చు లేక ఎన్టీఆర్ కోసం రాసిన డైలాగుల వల్ల కావచ్చు. ఇంకొంచెం డెప్త్ గా అసలు ఎన్టీఆర్ ఏమిటి, ఆయన లోపలకు వెళ్లి చూపే ప్రయత్నం అయితే చేయలేదు.  దాంతో ఎమోషనల్ డెప్త్ మిస్సైంది అనిపించింది.  అలాగని అదేమీ మైనస్ అనలేం. అది కూడా ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అలాగే ఈ కథను ఓ ఎమోషనల్ ఆర్క్ లో బంధించే ప్రయత్నం చేసారు క్రిష్. దాంతో భార్య తో ఆయనకున్న అనుబంధం..కుటుంబ బంధాలు అనే కొత్త కోణం ఆయన అభిమానులకు పరిచయం చేసినట్లు అయ్యింది. 

అలాగే ఈ కథలో ఎక్కవ హై అనిపించింది ఎక్కడా అంటే దివిసీమ ఎపిసోడ్..అక్కడ నుంచి రాజకీయంగా సినిమా కలర్ ని మార్చుకుంటూ వచ్చి..తెలుగుదేశం పార్టీ ప్రకటించటం అనే ఎపిసోడ్  వరకూ ..చాలా చకచక్యంగా క్రిష్ డిజైన్ చేసారు.  

ntr kathanayakudu movie review

నోస్టాలజీ..ఇదో కొత్త ఐడియాలజీ

బయోపిక్ అనేది గతాన్ని  మన ముందు ఆవిష్కరించే ఓ అద్బుతమైన పక్రియ. నోస్ట్రాలజీ అందరికీ ఇష్టమే కాబట్టి బయోపిక్ లు బ్రహ్మాండంగాద వెలుగుతున్నాయి. అది సావిత్రిది కావచ్చు...లేదా సిల్క్ స్మిత ది కావచ్చు. అయితే బయోపిక్ లకు కల్పించి మనకు అణుగుణంగా  చెప్పటానికి ఉండదు. కొద్దిగా డ్రామా యాడ్ చేయగలరేమో కానీ అంతకు మించి ముందుకు వెళితే విమర్శలు పాలవుతారు..తిప్పికొడతారు. అందుకే బయోపిక్ ఎంత సేఫో..అంత డేంజర్. ఈ సమస్య ఖచ్చితంగా క్రిష్  కు ఎదురయ్యి ఉంటుంది. అక్కడే తెలివిని ప్రదర్శించాడు. ఈ  స్క్రిప్టులో.. జనరంజికమైన అంశాలను ముందు పెట్టుకుని, వివాదాస్పద విషయాలను ప్రక్కన పెట్టి విషయ ప్రధానంగా నడిపించారు.

విస్తృతమైన పరిశోధన చేసి...ఆయన కుటుంబాలవారికి, ఆప్తులకు మాత్రమే తెలిసిన విషయాలను సైతం కొన్ని పట్టుకుని మనకు కొత్త అనుభూతిని ఇచ్చారు. ఆ విషయంలో క్రిష్ కు నూటికి నూరు శాతం మార్కులు పడతాయి. అలాగే ఆనాటి వ్యక్తుల గెటప్ లు మాత్రమే కాకుండా వారి వ్యక్తిత్వాలను సైతం ఆ పాత్రల్లో ప్రతిబింబించేలా చేయటం మరో మెరపు. అవన్నీ సగటు ప్రేక్షకుడుకి నోస్ట్రాలజీ ఫీలింగ్ ఇస్తాయనటంలో సందేహం లేదు. 

అయితే సినిమా నెమ్మిదిగా సాగటం, లెంగ్త్ ఎక్కువ అనిపించటం అన్నంలో రాళ్లులా కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశాలు. ఇక తన ప్రతీ సినిమాకూ  రైటింగ్ సైడ్ చాలా జాగ్రత్తలు తీసుకునే క్రిష్... ఈ సినిమాలోనూ అదే పంథాను అనుసరించారు. ముఖ్యంగా డైలాగులు విషయంలో అచి,తూచి, తూకం వేసినట్లుగా రావటంతో బుర్రా సాయి మాధవ్ మరోసారి సక్సెస్ అయ్యారు.

 

సూపర్ ఎపిసోడ్స్.. 

శ్రీకృష్ణుడుగా, వెంకటేశ్వర స్వామిగా చేస్తున్నప్పుడు ఆయన చూపించే కమిట్మెంట్, తన కుమారుడు చనిపోయినప్పుడు వచ్చే ఎమోషనల్ సీన్, క్లైమాక్స్ లో పార్టీ ప్రకటించటం వంటివి తెరపై చూస్తేనే బాగుంటాయి. ఎంత తెలిసిన కథైనా విజువల్ గా చూడటంలో ఉన్న థ్రిల్, కిక్ వేరు. 

 

హైలెట్స్ ..

ఎన్టీఆర్‌-ఏఎన్నార్ మ‌ధ్య అనుబంధం వివరించే సీన్స్, తిరుప‌తికి వెళ్లిన తెలుగువారు మ‌ద్రాసు వెళ్లి ఎన్టీఆర్‌ను క‌ల‌వ‌డం, ఎన్టీఆర్ వ‌య‌సు మ‌ళ్లిన త‌ర్వాత న‌టించిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను చూసిన కుటుంబ‌స‌భ్యులు మ‌రీ ముఖ్యంగా కుమార్తెలు ఎలా ప్ర‌వ‌ర్తించారు? వంటివి చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించాయి.

 

నో పొలిటకల్ ఎఫైర్..

సినిమాలో రాజకీయ విమర్శలు, వివాదం అనిపించే విషయాలు ఎక్కడా లేవు. సెంకండాఫ్ వాటిని రాజకీయ జీవితం దాచి పెట్టడంతో ఇక్కడ వాటిని టచ్ చేయలేదు.

 

బాలయ్య,మిగతా నటులు ఎలా చేసారు..

ఈ సినిమాలో చాలా మంది సీనియర్స్, జూనియర్స్, స్టార్ చాలా చిన్న పాత్రల్లో కూడా కనపడి, ఆ రోజుల్లోకి మనలను తీసుకెళ్లి తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారు.  చాలా భాగం బాలయ్య  తనే తండ్రిలా జీవించారు.  అయితే కొన్ని సార్లు ఆయనలోని బాలయ్య బయిటకు వచ్చేసారు. కానీ క్రిష్ కంట్రోలు చేసి మళ్లీ ఆ పాత్రలోకి పంపేసి..సీన్స్ పండేలా చేసారు. అలాగే ఫస్ట్ హాఫ్ లో యంగ్ ఎన్టీఆర్ గా బాలయ్య ఏజ్ ఫాక్టర్ వల్ల తేలిపోయారు. కానీ సెకండాఫ్ లో ఆ వయస్సుకు తగ్గ సీన్స్ రాగానే పెద్దాయనే మళ్లీ వచ్చార అని కొన్ని చోట్ల అనిపించారు. 

విద్యాబాలన్ ని బసవతారకం పాత్రలోకి తీసుకోవటం ఫెరఫెక్ట్ సెలక్షన్ అనిపిస్తుంది. సుమంత్ తన తాతగారు ఏ ఎన్నార్ లా బాలయ్యకు పోటీ పడి నటిస్తే..కళ్యాణ్ రామ్ మాత్రం సెట్ కాలేదనిపించింది. లుక్ పరంగానూ, డైలాగుల్లోనూ తేలిపోయారు. వెన్నెల కిషోర్, నరేష్ వంటివారు చేసిన పాత్రలు ఆ కాలం సినిమావాళ్లకు తప్ప బయిట ప్రపంచానికి తెలియదు కాబట్టి, వాటి మంచి, చెడులు, సెట్ అయ్యిందా లేదా వంటివి ఎంచే సమస్య లేదు. 

ntr kathanayakudu movie review

టెక్నికల్ గా ..

క్రిష్ సినిమాలకు ప్రత్యేకంగా సాంకేతిక విలువలు గురించి మాట్లాడేందుకు ఏమీ ఉండదు. తన తొలి చిత్రం నుంచీ హై స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. పెద్ద టెక్నీషియన్స్ తెచ్చుకున్నా..వారి నుంచి మంచి అవుట్ పుట్ తీసుకోవటం అనేది వేరే పక్రియ. ఆ విషయం లో క్రిష్ పండిపోయారని ఈ సినిమా మరోసారి చెప్తుంది. ముఖ్యంగా కెమెరా వర్క్ అదిరిపోయింది. అలాగే ఆర్ట్ డిపార్టమెంట్ సైతం ఆ రోజుల్లోకి తీసుకెళ్లటంలో సఫలీకృతమైంది.

 

సంగీతం..

కీరవాణిగారు సంగీతం అందించిన ఈ సినిమాలో పాటలు ఎంత బాగున్నాయో..బ్యాంక్ గ్రౌండ్ స్కోర్ అంతకన్నా బాగుంది. అయితే ఈ రెండింటికన్నా మధ్య మధ్యలో వచ్చే ఎన్టీఆర్ పాత పాటల రీమిక్స్ మరింత బాగుంది. 

 

ఫైనల్ థాట్..

ఎన్టీఆర్ గురించి తెలిసిన వారికి ఈ సినిమా ఓ అద్బుతం. ఆయన భక్తులకు ఇదో వరం. అయితే ఆయన గురించి తెలియనివారు చూస్తే మాత్రం ఇదో డాక్యుమెంటరీ ఫిలిం.

రేటింగ్: 3.5/5

తెర వెనక, తెర ముందు..

నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవి ప్రసాద్‌ తదితరులు

సంగీతం: ఎం.ఎం.కీరవాణి

సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వీఎస్‌

ఎడిటింగ్‌: అర్రం రామకృష్ణ

సంభాషణలు: బుర్రా సాయిమాధవ్‌

నిర్మాత: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి

సంస్థ: ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా

విడుదల తేదీ: 09-01-2019

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios