Asianet News TeluguAsianet News Telugu

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తన తండ్రి పాత్ర పోషించడాన్ని చాలెంజింగ్ గా తీసుకున్నారు బాలయ్య. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. 

Who is playing NBK in NTR
Author
Hyderabad, First Published Dec 26, 2018, 10:43 AM IST

నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తన తండ్రి పాత్ర పోషించడాన్ని చాలెంజింగ్ గా తీసుకున్నారు బాలయ్య. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు.

అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుండి సినిమాకు సంబంధించి కొన్ని విషయాలపై క్లారిటీ రాలేదు. ఇప్పటికే సినిమాలో ఎవరెవరు ఏఏ పాత్ర పోషిస్తున్నారనే విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. అయితే బాలకృష్ణ పాత్రను సినిమాలో ఎవరు పోషిస్తున్నరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 

బాలయ్య పాత్రలో అతడి కొడుకు మోక్షజ్ఞ కనిపిస్తారనే టాక్ వినిపించింది. మోక్షజ్ఞ ఈ సినిమా సెట్స్ కి వెళ్లడంతో అది నిజమేనని చాలా మంది అనుకున్నారు. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో బాలకృష్ణ పాత్రకు పెద్దగా ప్రాధాన్యతనివ్వలేదట. కథ మొత్తం ఎన్టీఆర్ చుట్టూ తిప్పడానికి బాలయ్య రోల్ ని కట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇది నందమూరి అభిమానులకు షాకింగ్ గా అనిపించినా.. క్రిష్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదట. బాలకృష్ణ కనిపించే రెండు, మూడు సన్నివేశాలు కూడా వెనుక వైపు నుండి చూపిస్తారని, కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్ తో కానిచ్చేశారని తెలుస్తోంది. లెజండరీ ఎన్టీఆర్.. బాలకృష్ణ పెళ్లికి అటెండ్ కాలేదట. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసట. ఆ ఎపిసోడ్ ని ఈ సినిమాలో చూపించబోతున్నారని సమాచారం. 

సంబంధిత వార్తలు.. 

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

Follow Us:
Download App:
  • android
  • ios