Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేవి? వీరిద్దరూ ఒకప్పుడూ మంచిగానే ఉండేవారా? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు ఆయన గురించి వైఎస్  చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఏమిటీ

ys rajashekar reddy role in kathanayakudu cinema
Author
Amaravathi, First Published Jan 9, 2019, 1:02 PM IST


హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేవి? వీరిద్దరూ ఒకప్పుడూ మంచిగానే ఉండేవారా? ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు ఆయన గురించి వైఎస్  చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఏమిటీ? ఈ ప్రశ్నలకు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బాలకృష్ణ సమాధానమిచ్చారు.

ఎన్టీఆర్  రాజకీయాల్లోకి రాకముందు వైఎస్‌కు ఆయనకు మంచి సంబంధాలు ఉండేవట. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ముందే ప్రకటిస్తారని  కూడ వైఎస్ఆర్ ఆ కాలంలోనే అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో  ఈ సన్నివేశాలను బాలకృష్ణ తెరకెక్కించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్  పార్టీలో కీలకంగా వ్యవహరించారు కొన్ని సమయాల్లో  ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల్లో వైఎస్ఆర్  తీవ్రంగా స్పందించిన ఘటనలు కూడ ఉన్నాయి. అయితే ఇవన్నీ రాజకీయాల్లో జరిగిన ఘటనలు.

రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రాకముందు ఎన్టీఆర్, వైఎస్ఆర్ మధ్య ఎలాంటి సంబంధాలు ఉండేవనే ఆసక్తి అందరిలో నెలకొంటుంది. చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, గులాం నబీ ఆజాద్, కేఈ కృష్ణమూర్తి  కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలను ప్రారంభించారు.వైఎస్ఆర్, చంద్రబాబునాయుడులు యూత్‌ కాంగ్రెస్‌లో చురుకుగా ఉండేవారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి చెందిన కేఈ కృష్ణమూర్తి,  చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు మంచి స్నేహితులు. కేఈ కృష్ణమూర్తి కంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో చంద్రబాబునాయుడు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. 1978లోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. అంజయ్య మంత్రివర్గంలో చంద్రబాబునాయుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడ చంద్రబాబునాయుడు పనిచేశారు.

చంద్రబాబునాయుడు, వైఎస్ ఆర్ లు మంచి స్నేహితులు కావడం వల్ల చంద్రబాబునాయుడు వివాహం సమయంలో వైఎస్ కూడ ఆ పెళ్లికి హాజరయ్యారు. ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని చంద్రబాబునాయుడు వివాహం చేసుకొన్నారు. ఈ సమయంలో చంద్రబాబునాయుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడ ఉన్నారు.

భవనం వెంకట్రామ్ రెడ్డి, ఎన్టీఆర్‌లు కాలేజీలో మంచి స్నేహితులు. భవనం వెంకట్రాం రెడ్డి   ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎంగా ప్రమాణం చేసే సమయంలో  ఎన్టీఆర్ సినీ రంగంలో ఉన్నారు. అయితే అదే సమయంలో  ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వచ్చాయి.

భవనం వెంకట్రామ్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే సమయంలో ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ను కూడ భవనం వెంకట్రామ్ రెడ్డి ఆహ్వానించారు. అయితే ఆ సమావేశానికి చంద్రబాబునాయుడుతో కలిసి ఎన్టీఆర్ రాజ్ భవన్ ‌కు వచ్చారు. రాజ్ భవన్‌ వద్ద చంద్రబాబునాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని  పరిచయం చేయించినట్టు ఈ సినిమాలో సన్నివేశాన్ని తెరకెక్కించారు.

తాను గతంలో ఎన్టీఆర్ ను కలిసినట్టుగా  వైఎస్ఆర్ గుర్తు చేస్తారు. చంద్రబాబునాయుడు వివాహం సందర్భంగా తాను ఎన్టీఆర్ ను కలిసిన విషయాన్ని వైఎస్ ప్రస్తావిస్తారు.వైఎస్ గురించి చంద్రబాబునాయుడు  ఎన్టీఆర్ కు చెబుతారు. ఆ సమయంలో వైఎస్ భుజాన్ని ఎన్టీఆర్  తట్టినట్టుగా సినిమాలో చూపారు. 

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం మీడియాలో రావడంతో అసెంబ్లీలోనే అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య చంద్రబాబునాయుడును  ఈ విషయమై ప్రశ్నిస్తారు. అయితే  రాజకీయాల్లోకి వస్తారనే విషయం తనకు తెలియదని చంద్రబాబునాయుడు అంజయ్యకు చెబుతారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైఎస్ ఎన్టీఆర్ చెప్పిందే చేస్తాడని అన్నట్టుగా ఈ సినిమాలో చూపారు.

ఎన్టీఆర్ పట్ల వైఎస్ఆర్ సానుకూలంగా మాట్లాడినట్టుగా ఈ సినిమాలో చూపించారు. కానీ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వైఎస్ఆర్ ఆందోళనల్లో ముందున్నారు. అయితే మహానాయుడు సినిమాలో వైఎస్ఆర్ పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది. కథానాయకుడు సినిమాలో  మాత్రం ఎన్టీఆర్ వైఎస్ఆర్ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేనట్టుగా చిత్రీకరించారు.

సంబంధిత వార్తలు

కథానాయకుడు సినిమా: ఇందిరాగాంధీతో ఎన్టీఆర్ ఫస్ట్ ఎన్‌కౌంటర్

కథానాయకుడు సినిమాలో రామోజీ పాత్ర ఇదీ....

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో వైఎస్ పాత్ర ఇలా...

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

 

Follow Us:
Download App:
  • android
  • ios