నటరత్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన "ఎన్టీఆర్" సినిమాకు మొదట డైరక్టర్ గా అనుకున్నది తేజనే అనే సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన మార్చి 29న 'ఎన్టీఆర్' సినిమా హైదరాబాద్‌లోని రామకృష్ణ స్టూడియోలో అట్టహాసంగా ప్రారంభమైంది.  ప్రారంభోత్సవానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముహూర్తపు క్లాప్ కొట్టారు.  

అయితే ఊహించని విధంగా  డైరెక్షన్ బాధ్యతల నుంచి దర్శకుడు తేజ తప్పుకున్నారు. నటరత్న ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై చూపించేందుకు ఆయన కుమారుడు, హీరో నందమూరి బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకు తాను న్యాయం చెయ్యలేననిపించి ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తేజ తెలిపారు.  ఈ విషయమై రకరకాల రూమర్స్ వినిపించాయి. వాటికి చెక్ చెప్తూ బాలయ్య అసలు ఏమైందో మీడియాకు తెలియచేసారు. 

బాలయ్య మాట్లాడుతూ..“ తేజ తో మొదట ఈ సినిమాని మొదలెట్టాం. కానీ ఇలాంటి మాసివ్ రెస్పాన్సిబులిటీని ఆయన హ్యాండిల్ చెయ్యలేను అని భావించారు. అదే విషయం నాకు చెప్పారు. దాంతో ఓ టైమ్ లో ఈ ప్రాజెక్టుని నేను డైరక్ట్ చేద్దామనుకున్నాను. అప్పుడు దర్శకుడు క్రిష్ వచ్చి   “బాబు ,నేను ఈ ప్రాజెక్టుని డైరక్ట్ చేయనా ?” అని అడిగారు. నేను రెండే రెండు నిముషాల్లో ఓకే చెప్పాను ,”అన్నారు. 

నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్  లో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ జనవరి 9న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పటికే కథానాయకుడు ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేసింది. కాగా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్  ఓ ఇంటర్వ్యూని విడుదల చేసింది. ఇంటర్వ్యూలో తేజ ఎందుకు ఈ ప్రాజెక్టుని వదిలేసి వెళ్లిపోయారో బాలయ్య చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు.. 

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?