Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

ఎన్టీఆర్ బయోపిక్ రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాపై ఎక్కడా లేని బజ్ క్రియేట్ అయింది. 

writer srinath complaints against ntr biopic
Author
Hyderabad, First Published Jan 8, 2019, 10:36 PM IST

ఎన్టీఆర్ బయోపిక్ రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాపై ఎక్కడా లేని బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే అభిమానుల హడావిడి మొదలైపోయింది. చిత్రబృందం కూడా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతోంది. ఓ వైపు ఇలా ఉండగా.. ఈ సినిమా కారణంగా ఓ రచయితకి అన్యాయం జరిగిందనే విషయం షాకింగ్ గా మారింది. 

గతంలో 'కుబుసం' అనే సినిమాను రూపొందించిన దర్శకుడు ఎల్.శ్రీనాథ్ 'ఎన్టీఆర్' బయోపిక్ కి రచయితగా పని చేశారు. ఏడాదిన్నర క్రితం నుండే ఈ సినిమా కథకి  సంబంధించిన కసరత్తులు మొదలయ్యాయి. అప్పటినుండి శ్రీనాథ్ కథపై పని చేస్తున్నాడు. బాలకృష్ణ మొదట ఆమోదించిన కథ మొత్తం శ్రీనాథ్ ఆధ్వర్యంలోనే తయారైంది. దర్శకుడు తేజ కూడా దానికి ఒప్పుకున్నాడు.

కానీ తేజ తప్పుకోవడం, క్రిష్ రావడం జరిగిపోయాయి. ప్రాజెక్ట్ చేపట్టిన క్రిష్ తన మార్క్ కనిపించడం కోసం కొన్ని మార్పులు చేశాడు. కథ విషయంలో మార్పులు చేయడం కుదరక స్క్రీన్ ప్లే విషయంలో తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో శ్రీనాథ్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. టైటిల్స్ లో కూడా ఆయన పేరు పెట్టలేదట. తెలంగాణ నేపధ్యం గల శ్రీనాథ్ కి ఉద్యమం, పోరాటాలకు సంబంధించిన కొంత బ్యాక్ గ్రౌండ్ ఉంది. దీంతో విషయం కాస్త పెద్దదైంది.

దర్శకుల సంఘంలో శ్రీనాథ్ ఫిర్యాదు చేశాడు. తెలంగాణాకి చెందిన శ్రీనాథ్ కి అన్యాయం చేస్తున్నారని, తెలంగాణ ప్రతిభని తొక్కేస్తూన్నారని దర్శకుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో క్రిష్ తొ పంచాయితీలు జరిపారు. టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడానికి క్రిష్ కి ఈగో సమస్యలు రావడంతో ఫైనల్ గా రచనా సహకారం వద్ద శ్రీనాథ్ పేరు వేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

శ్రీనాథ్ కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని సమాచారం. అయితే ఈ వివాదం మొత్తం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.   

సంబంధిత వార్తలు.. 

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. అసలు మేటర్ ఉంటుందా..?

ఎన్టీఆర్, ఏఎన్నార్ ల నుండి నేర్చుకున్నవి అవే: బాలకృష్ణ

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

Follow Us:
Download App:
  • android
  • ios